పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, మార్చి 2014, మంగళవారం

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || శోధన|| ========================== జీవిత అర్ధం కోసం ప్రతి రోజు భూతద్దం పెట్టి నిఘంటువులో వెతుకుతున్నా నానార్ధాలు తప్ప జీవిత అర్ధం తెలీక అపార్ధాల లోకంలో సంచరిస్తున్నా ! ప్రతి రోజు అద్దం భూతద్ధమై వెక్కిరిస్తుంటే నా ప్రతిబింబం అద్దంలో నుండి తొంగి చూస్తుంది ఈ గూడర్దాల లోకంలో నా రూపం నిత్యం నయవంచనకు లోనవుతూ ... అర్ధం కోసం అన్వేషిస్తే జీవితం పరమార్ధంగా మారింది నిత్య శోధనలో ఎన్నో కఠోర సత్యాలు బాహ్యం గా అర్ధం తెలీక నగ్నంగా వెక్కిరించాయి జీవితంలో నిత్య సంఘర్షణలు ఇంద్రజాలంలా మాయమవుతున్నాయి నీడలు మాత్రం తరుముతున్నాయి నేను మాత్రం పరిగెడుతున్నా నిఘంటువు జీవితమయ్యింది ఎన్నో ఎన్నెన్నో పరమార్ధాల నడుమ జ్ఞాపకాల భూతద్దం పగిలిపోయింది అద్దం లో నీడలు లేవు ప్రతి పేజి ఒక జీవితమే ! ------------------------- మార్చి 25/14

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hmYC03

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి