వనజ తాతినేని || స్వప్నలోకం || స్తబ్దత లోను.. అతి నిశ్శబ్ద భావ సంచనల రూపమా.. చేతనతో నన్ను నేను దర్శించుకునేలా చేసే..మాయా దర్పణ సౌధమా .. అనిశ్చిత జీవితాల అంతులేని సందిగ్ధతల క్లిష్ట రూపమా.. జీవనకాసారంలో.. నేడు - రేపు మధ్య సంధిగా నిలిచిన మగతలో.. మరో.. లోకాన్ని.. చూపిన.. నేస్తమా .. అచేతనావస్థలో.. గత స్మృతులను రేపిన.. స్వప్నమా. లౌకిక స్వప్నాలతో.. అలౌకిక ఆనందం మిగిల్చిన .. తేజమా.. కోటి ఊహలతో.. మనోరధంపై..ఊరేగానో కోరికల రెక్కల గట్టుకుని అంబరాన స్వేచ్చా విహంగమై.. విహరించానో.. కలతలెన్నో.. మరిపించావు.. కలవరము కల్గించావు.. నీలో నేను కరగని నాడు.. నేనొక విగత జీవినో..నిశాచరినో.. అందుకే.. అయ్యావు నువ్వే నాలోకం... నాదైన లోకం. స్వప్నలోకం.. స్వప్న సౌధంలో .. నివశిస్తూ అందరు స్వప్న సాకారానికి..ప్రయత్నిస్తూ కొందఱు .. జీవితమంతా స్వాప్నికమై.. సాగుతూ మరి కొందఱు .. స్వప్నం .. బ్రాంతిగా భావించిన ఎందఱో ... ఇందరికి ఉందిక్కడ లిఖించలేని చిరునామా ఓ ... జీవితకాల నమూనా. 25/03/2014.
by వనజ తాతినేని
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gVUC5C
Posted by Katta
by వనజ తాతినేని
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gVUC5C
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి