పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి శీర్షిక :~- 16 చదివిన కవిత్వ సంపుటి :-~: "మట్టివేళ్ళు" కవిత్వ సంపుటి రాసిన కవి :~--'కట్టా శ్రీనివాస్" ఈ సంపుటిని పరిచయం చేస్తున్నది :--~ రాజారామ్.టి "స్ఠిమితత్వమే కట్టా శ్రీనివాస్ కవిత్వతత్వం" " నేనొక నదిని/ప్రవహించే వరదని/ఫృధివి జీవన హృదిని/నిరంతరానువర్తన ఆవృతిని"-అని తన్ను తాను పరిచయం చేసుకొటున్న కవి కట్టా శ్రీనివాస్."పాకే పురుగులాంటి జీవితం చుట్టూ, పొరలుపొరలుగా పేరుకుపోయిన ఉదాశేనపు గూడు,బద్దకంగా నిద్రపోయే లోపటిపొరల్లొంచి,నవ్వూ,ఏడుపూ ఏదీ స్వచ్ఛంగా బయటికి రాదు,జీవం రావాలంటే మళ్ళీ బాల్యంలోకో,గూళ్ళన్నీ బద్దలు కొట్టుకొంటూ భవిష్యత్తులోకో దూకాలి"-అనే జీవిత తాత్విక రహస్యాన్నీ చెప్పినవాడు కట్టా శ్రీనివాస్."ఒక అర్థరాత్రి/నా కవితల్నీ నేనే చదువుకుంటూ/నా డైరీనీ నేనే పరిశీలిస్తూ అపరిపక్వతకు నవ్వుకుంటాను."-అని కవిత్వపు లోతునూ అర్థమయ్యేటట్లుగా వ్యాఖ్యానం చేసిన కవి శ్రీనివాస్. ‘నాకో గమనింపు వుంది./వేళ్ళేప్పుడూ నేలలోనే వుండాలని/ఆధారమే కాదు,ఆహారమూ అక్కడిదేనని/నేల విడిచిన సాముకి నిలకడేమీ మిగలదని./మట్టి వేళ్ళు నాకెపుడూ చెబుతూనే వుంటాయి."-అని అనుకొంటూ వొక తాత్విక రహస్యాన్ని విప్పి చెప్పిన కవి శ్రీనివాస్. "మిత్రపొత్తం'తెరచి "వెంటాడే బాల్యం"లోని నవ్వే సీతకోక చిలుకలతోట"ను ఙ్ఞాపకానికి తెచ్చుకొని "నవ్వే నక్షత్రాలు" ఎన్నున్నాయో లెక్కిస్తూ,ఈ జన సమూహం ఈనాడొక "ద్వీప స్వమూహం" అని భావించుకొంటూ...'కాలం చెల్లిన పాటలు" పాడకుండా "నేనెలా మారాలి" అనే "ప్రశ్నోపనిషత్తు"ను ఎదుర్కొంటూ"వర్షం వెలిశాక' ఓటమి నుంచి పాఠం" నేర్చుకోవడానికీ 'ఇంకో ప్రయత్నం" చేస్తున్న స్థిమితత్వం కలిగిన మంచి కవి కట్టా శ్రీనివాస్. "పుట్టలోని చెదలు" పుట్టొచ్చు గిట్టొచ్చు కానీ శ్రీనివాస్ కవిత్వం అనందాన్ని పుట్టిస్తుంది.ఈకవిత్వం పై "నెగెటివ్ వాయిస్"అసలు వినిపించదు."మరోసారి" "ప్రయాస"పడి చదివితే ఈ కవిత్వపు "అంచులపై హర్మ్యాలపై"నిలబడితే ఒక అద్భుత అనుభూతితో పాటూ,ఒకఆలోచన"Xగ్రేసియో"గాపొందొచ్చు.కవుల"గుంపులో అతడొక చూపుడు వేలు".అందుకేఅఫ్సర్ ఈ కవిని "వాస్తవికతని ఎలాంటి ముసుగులు లేకుండా వాస్తవికతగా చూసే దృష్టి గల స్థిమితత్వ కవిగా ఆలోచన చేశారు.చాల నెలలుగా శ్రీనివాస్ కవిత్వాన్ని చదువుతూ,రాయాలని ప్రయత్నించి విఫలమయి చివరకు ఈ కవిత్వంపై "పండిత చర్చ' చేయడంకన్నా ఇది హృదిలో కురిపించే అనుభూతి "చిరుజల్లు'ను పరిచయం చేయాలనుకున్నా. ప్రపంచీకరణ కారణంగా మనిషి యాంత్రికమవ్వటమే కాదు వ్యాపారమయ్యాడు.అందుకే అతడు వొంటరి అయ్యాడు.పైగా సమూహంలో కూడా వొంటరయ్యాడు.కాబట్టే కట్టా శ్రీనివాస్ మనిషిని' "ద్వీప సమూహం"అని అంటాడు.ద్వీపకల్పమైతే వొకవైపన్నా నేల స్పర్శ వుంటుంది.ద్వీప సమూహం అయినప్పుడు అన్ని వైపుల వ్యాపార సంబంధాల తడే.అది దుఃఖపు తడి కాదు శూన్యపు,ఏకాంతపు,వొంటరితనపు తడి.అందుకేనేమో కవి "నిన్ను నీవు ఆవిష్కరించుకోకుంటే/ ప్రపంచం తన నిశ్శబ్దంలో బహిష్కరిస్తుంది.ఎందుకంటే అసలే నీవొక దీవివి'అని మనిషికి హెచ్చరికను చేస్తాడు."నలుగురిలో జతపడాలంటే పిల్లోడా మాటల వంతెన వాడాల్సిందేరా బుల్లోడా"-అని మనిషికీ,మనిషికి మధ్య మాటల వంతెన ఏర్పడాలని కవి కోరుకొంటాడు.తన కాలపు సినిమాలను వాచ్యం చేస్తూమనిషితనాన్నిపరోక్షఆవిష్కరణచేస్తాడు.మగధీర,చంద్రముఖి,సుడిగాడు,అపరిచితుడుమునగుచిత్రాలనుసమాజంలోని మనిషి పరంగా వ్యాఖ్యానిస్తాడు.అపరిచితుడు సినిమా లో హీరో రామంగా,రెమో గా,అపరిచితవ్యక్తిగావిడి విడి వేళ్ళలా ఒంటరిగా పొరాడితే ఏ ఫలితం వుండదు అని చెబుతూ,"వేళ్ళైనా విడి విడిగావదలకు/మడిచిపడితేనే/పిడికిలౌతుంది"అనితళుకులీనే వాక్యాల్లో చెబుతాడు. తన కవిత్వంలో శ్రీనివాస్ ఏ సందర్భంలోనైనా దేన్ని గురించి మాట్లాడిన తనను గురించి,మనిషి గురించి స్పృశించకుండా వుండడు."మట్టివేళ్ళు"-అనే కవితలో "విశాల బాహువులను చాపుకుంటూ ఆకాశంలోకి ఎదిగిన చెట్టు గురించి మాట్లాడుతూ మనిషి ఎంత ఎత్తు ఎదిగినా తనకు ఆధారమైన తాను నిలబడ్డ నేలను మరువరాదనే విషయాన్ని ,మనిషి ఎంత ఎత్తు ఎదిగినా తాను నిలబడ్డ నేలను విస్మరించారదనే దాన్ని చెబుతూ వేళ్ళు తనకు ఆధారాన్ని'ఆహారాన్ని అందించేవని గుర్తుకూ తెచ్చుకొంటూ,మనిషి కూడా నేల విడిచి సాము చేయ రాదని వొక జీవన వాస్తవాన్ని విప్పి చెబుతాడు.చాల మంది కవులు కళ్ళను వొక అలంకారంగా భాసింప చేయాలనుకున్నప్పుడు వాటిని తామర పూలతోనో,పద్మ దళంగానో పోలుస్తుంటారు.కానీ శ్రీనివాస్ "చెట్టు చూసేది నలు దిశల ప్రపంచాన్ని పత్రనేత్రాలతో"--అని కళ్ళను పోలుస్తూ వొక కొత్త కవి సమయాన్ని ప్రయోగించాడు.ముఖం ఆకర్షణీయంగా వుందనటం వొక సాంప్రదాయం.దీన్నే కవి "సుకుమార ఆకర్షణ పత్రాల ముఖంలో అని అంటాడు.వొక అద్బుత సాయంత్రాన్ని కోరిక రహితంగా మనలోకి వొంపుతాడు. పుస్తకం తన నేస్తం.ఈ భావాన్నే "మిత్రపొత్తం" అనే కవితకు ఊపిరి చేశాడు కవి."పుస్తకాల అల్మెరా తెరిస్తే "ప్రపంచపు కిటికీ తీసినట్లే.'-ఇక పొత్తాన్ని తెరిస్తే ఓ ముద్దుల పురాతన తాత బుజ్జగింపులతో తల నిమిరినట్లే తోస్తుంది."-ఇలాంటి వాక్యాలు పుస్తకపు గొప్ప దనాన్ని,అది అందిచ్చే అనుభూతిని ఊరిస్తాయి.ప్రియమైన స్నేహితుల స్నేహం దాచిన పుస్తకమంతా కమ్మని వాసనలు వస్తాయనే కవి భావన మనల్నీ పుస్తకాలవైపు మళ్ళిస్తుంది."ఎండుతున్న మానెందుకు విలపిస్తోందని 'రాలుతున్న పండుటాకును అడుగుతాడు కవి కాలం చెల్లిన పాటలు"-అనే కవితలో.చెట్టు వలే ఆకు గూడ మరణపు అంచుల్లోనే వుండేది.కవి అడిగిన ప్రశ్నలకు ఆ ఆకు అంతరంగంలోవుండే ఆలోచనల జవాబుల్నీ కవే ఆకు తరపున కవిత్వం చేశాడు."మౌనాన్ని మరి కొంచెం అరువివ్వటమో/గతి తప్పిన ఙ్ఞాపకాల గతాన్ని/గంపలకొద్ది గుమ్మరించటమో తప్ప"-చేసేది ఏమి లేదని చెబుతూ చెట్టు బాగున్నప్పుడూ పిట్టకో పురుగుకో ఆశ్రమిచ్చి "అందరి బంధువులా సందడి"చేసిందని ఆ చెట్టుకు తన తనువే భారమైన విషాదాన్ని మోడైన తరువాత అది కోల్పోయిన చెట్టు తనాన్ని మనిషికి ఆపాదిస్తాడు శ్రీనివాస్. శ్రీనివాస్ కి అధిక్షేపంతో కూడిన వ్యంగ్యాన్నీ కవిత్వపుగా కొస మెరుపు చేయటం యిష్టంలా వుంది.నగరపు రోడ్డు మీది గుంటలు,మ్యాన్హోల్స్ మున్నగు వాటి వల్ల జరిగే ప్రమాదాల్ని చాల వ్యంగ్య చమత్కారంతో భాగవత,రామాయణ,భారతంలలోని సన్నివేశాల్ని గుర్తుకు తెస్తూ,వాటిని రూపకాలుగానో,ఉపమలుగానో చేస్తూ చెప్పిన కవిత"సమాంతర కందకాలు"."లేవండిక/మరి మొద్దు నిద్ర..!/మొసలి పట్టిన ఏనుగు కోసం/చటాలున పరిగెత్తుకొచ్చిన ఆయన/స్వంత భార్య భూమిలోకి ఇంకిపోతుంటే/చేష్టలుడిగి చూసినట్లు"-ఈ వాక్యాల్లో కవి వాడిన వ్యంగ్య వైచిత్రి నగరం నీటి మడుగై పొరలుతున్నప్పుడు ప్రమాదపు మొసళ్ళ బారిన పడిన వాళ్ళని గురించి ఆలోచించని తత్వానికి,రాజ్య నిర్లిప్తతకు చురకలంటిస్తుంది. శ్రీనివాస్ లోని స్థిమితత్వమే కవిత్వం చేయలనుకొన్న వస్తును ఎంతో గాఢతతో హృదిలోకి బట్వాడ చేసి అందుకు తగ్గ భావనను మేధలోకి వొంపి ఆ వస్తువుకు సరిపోయే రూపంలో పఠిత మదిలో వొదిగిపోయేటట్లుగా చేస్తున్నది ఈ సంపుటిలో.రేవ్ పార్టీలలో ఊగిసలాడిపోయి ఊపిర్లు సైతం కోల్పోతున్న యువతను చూడక తప్పని వైనాన్ని,ఆ యువతకి ప్రతీకగా గాలిపటాన్ని చూపి చెప్పిన కవిత' రేవు కొచ్చిన జీవితాలు.'"భధ్రంగా పట్టుకొన్నా రెండు చేతుల కళ్ళు కప్పి కొట్టుకొచ్చినట్లుంది"అనే పంక్తుల్లో యువత ఆకాశంలో తలెత్తుకెగరాల్సిన రోజు ఇలా తెగిపడి చావు రేవులో తేలుతున్న విషయాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు ఈ కవి."అనుబంధ దారం జారిందంటే గాలివాటపు జీవితం ఏ దరి చేరదు"-అనే వొక వాస్తవాన్ని కవి బలంగా నిర్మిస్తాడు."మట్టి వేళ్ళు"-అనే ఈ సంపుటి సారం అన్ని ఖండికల్లో ప్రవహించినా అర్తవంతమైన,వేగవంతమైన సమర్త ప్రవాహం మాత్రం కొన్ని కవితల్లో ఉరికురికీ వస్తుంది. గమనం ఎప్పుడూ కాలానికీ అతీతమే.పదార్థం ఎప్పుడూ నశించదు ఒక రూపం లోంచి మరో రూపం లోకి అనువర్తితమవుతుందనే విషయాన్ని శక్తినిత్యత్వ సూత్రం చెబుతున్నా కవి "ఈ విశ్వంలో పదార్థాలు ఎంత మిగిలినా ఆలోచన లేకపోతే ప్రపంచం నశించిపోయినట్లే"అనే వొక తాత్వికానుభుతిని వ్యక్తం చేస్తాడు.కాలం మనం కట్టుకున్న గడియారాలను పీకి పారేస్తే నిలిచిపోదు అది గమిస్తూనే వుంటుంది.అయితే చలనం అనేది లేకపోతే కాలం చచ్చిపోతుందంటాడు కవి.చలనం అంటే మనిషిలో వుండే ఆలోచనల చలనం చైతన్య చలనం.పైన చెప్పిన రెండు అంశాలను కవి ఒక ముఖ్య మానవ సంబధాల అంశాన్ని బలపరచాటానికి కవిత్వంగా మార్చాడు.అదేమిటంటే "పలకరింపులు లేనంతనే/ పరిచయాలు ఆగిపోవు./ఙ్ఞాపకాలు లేకపోతేనే అవి కాస్తా ముగింపు కొస్తాయి"-ఈ అంశాన్ని పై రెండు అంశాలు పక్క పక్కన నిలబడి నిలబెడతాయి.ఇలా కవిత్వం నిర్మించటం వొక అపురూప శిల్పం."కాలాతీత గమనం"-అనే కవిత కవి ఆలోచనా ప్రతిబింబం. శ్రీనివాస్ రాసిన 'హత్య'అనే కవిత చదవగానే గుర్తొచ్చింది తిక్కన మహాకవి రాసిన'పగయడగించుట యది లెస్స"అనే పద్యమే.ఈ' హత్య'- అనే కవిత ప్రారంభం వొక ఉద్వేగానికీ పాఠకున్ని గురిచేస్తుంది.అట్లా ప్రారంభమయ్యే వాక్యాలు రాయటం అంత సులువేం కాదు.కవిత ముగింపు కూడా అంతే ఉద్వేగభరితమై మనసును వికశింప చేసే వొక పాఠం అవుతుంది.శత్రువు ఎదురైతే వాని గుండెల్లోకీ బలంగా దిగేటట్టు పదునైన మెత్తటి చిర్నవ్వు కత్తి విసిరితే,అతని వైపు నుంచి కూడా అదే ఆయుధం వచ్చి గుండెల్లోకి బలంగా దిగితే ఇద్దరి మధ్య శత్రుత్వం చంపేయబడుతుందంటాడు శ్రీనివాస్.ఇమ్దు లోని మాటల పొదుపు ఇతని అభివ్యక్తి నైపుణ్యాన్ని మరింత పెంచింది.పాఠకుల్నీ పగయడగించే దిశగా అడుగులు వేయిస్తుంది. శ్రీనివాస్ లో వొక విలక్షణత వుంది.ఎంత ఆధునికుడైనా ప్రాచీన కావ్య సాంప్రదాయాలను పట్టుకున్న కవిగా అది ఆయన ప్రత్యేకతగా గుర్తించవచ్చు.పూర్వ కవులు ద్వర్థి కావ్యాలు రాశారు.పింగళి సూరన "రాఘవ పాండవీయం'-అనే ద్వర్థి కావ్యం రాశాడు.ఒకసారి చదివితే రాముని గురించి,రెండోమారు చదివితే పాండవుల గురించిన కథ స్ఫురించేటట్లూ ద్వర్థి కావ్యం చేస్తుంది."ఫ్రీజర్","వర్షం వెలిశాక","నేషనల్ హైవే"-మున్నగు కవితల్లో ఈ ద్వర్థి కావ్య లక్షణం అన్వేషిస్తే అగుపిస్తుంది.'నేషనల్ హైవే"-కవితలో అది మనతో మాట్లాడుతుంది.కవి రోడ్డుకు మానవ ఆరోపణ చేశాడు."ఇవి ఎన్నాళ్ళనుంచో పెంచుకున్న నా స్వీయ సౌందర్యాలు"-అని అది అనటంలో గత వైభవ స్మరణ గుర్తుకొచ్చి మార్గాలకిరుపక్కల గల చెట్లు కనిపిస్తాయి.వాటిని వెడల్పు చేసే నెపంతో తన స్వీయ అందాలను పతనం చేశారని ముందే ఎడంగా వుంచాలన్న బాధ్యతను పద్దతులను పాటించివుంటే "నేనీనాడు శిథిలదేహంతో అవనత వదన భారంతో"ఇలా దుఃఖిత నయ్యేదాన్ని కాదు కదా అని రహదారి విలపిస్తుంది."నీ సొమ్మెమిపోయింది?దర్జగా పనికానిచ్చేసి పట్టించుకోకుండా వెళ్ళిపోతారు"అని నిష్టూరమాడి,"వికలమైన ప్రతి శకలాన్ని పేర్చి కూర్చుకోవలసింది నేనేగా"అనుకొంటూ ఎవరో చేసిన దానికీ బాధ్యత తానేవహించాల్సి వచ్చినందుకు తనను సమాధానపరుచుకొంటూ భవిష్యత్తులో తన భయాన్ని వ్యక్తపరుస్తుంది.ఇలా రహదారిని వర్ణించే వస్తువును చేసిన కవి దాని మానవ్త్వ ఆరొపణ చేసి ఇంకొక వస్తువు పాఠకుడికి దృశ్యమానం చేస్తాడు. "వర్షం వెలిశాక"-అనే కవితలో వర్షం ఆగిపోతున్న దశలోని ప్రకృతిని ఆవిష్కరించే స్థితిలోనే మానవ మనస్సులో చెదిరిన స్వప్నాల కల్లోలానంతర స్థితిని స్ఫురింపచేస్తాడు."ఊగి ఊగి ఆగిన/మొరటు తూగుడు బల్లలా కురిసికురిసి వెలిసిన వర్షం./చూరు చివరనుండి ఒక్కొ చినుకు రాలుతోంది" ఈ వాక్యాల్లోని భావచిత్రం శ్రీనివాస్ ఊహ శక్తిని మన కళ్లముందు నిలబెడుతుంది."ఫ్రీజర్" అనే కవితలో మరో శిల్పాన్ని ఈ కవి ప్రవేశపెట్టాడు.చిత్రబంధ కవితా రీతిని కూర్చాడు."దిగటం"-అనే పదాన్ని ది అనే అక్షరం కింద వొకమెట్టుకింద మరొమెట్టులా గ,టం, అనే అక్షరాలను పేర్చి ఒక వైచిత్రిని ప్రదర్శించాడు.ఇవన్నీ సాహిత్య ప్రయోగాలే. స్త్రీ సహానుభూతితో స్త్రీ స్వరంలో వినిపించిన మంచి కవిత "ఒక ఫిరమోన్ కన్నీటి నవ్వు".సజాతి జమ్తువులు తనతో జతకట్టే దానికి తమ శరీరాల నుంచి వొక రసాయానాన్ని విడుదల చేస్తాయి.దాన్నె ఫిరమోన్ అమ్టారు.కన్నీటీకీ దుఃఖం వుంటుంది కాని నవ్వు వుండదు.తనువు పుండై తాను మరొకరికి పండైన ఆమె కన్నీటి నవ్వుతో తనజాతి మనిషైన మగవ్య్క్తి వెదజల్లే దన ఫిరమోన్ తో కడుపు సంచి నింపుకొనే విషాద భీభత్సాన్ని "పదిలో సగం భర్తలున్న ద్రౌపదిలా నేను పతివ్రతనే సుమా!" అనే ఆమె హెచ్చరిక స్వరాన్ని వినిపిస్తాడు. చాల చిత్రమైన కవి శ్రీనివాస్.చదివిన చదువురీత్యా,ప్రవృత్తి రీత్యా ప్రయోగాలంటే మక్కువేమో?కవిత్వంలో గూడా ఒక ప్రయోగం చేశాడు.పరషాలను,సరళాలను ప్రయోగించి ఒక కవిత రాశాడు.క,చ,ట,త,ప అనే వాటిని ఒక్కదానిని ఒక శీర్షిక చేసి,ఒక్కొక్క దాని కింద కొన్ని కవితా పంక్తులు రాశాడు.అట్లాగే సరళాలైన గ,జ,డ,ద,బ ల కింద కూడ కొన్ని కవిత పంక్తులు రాశాడు.అయితే వీటిని వరుసగా చదివితే ప్రశాంత భావం స్ఫురించదు.క-కింద వున్న కవితా పంక్తులను,గ_కింద వున్నవాటితో కలిపి చదివితే సుందర భావార్థం ద్యోతకమవుతుంది అట్లాగే మిగిలినవి చదువుకోవాలి.ఇట్లాంటి వైచిత్రిని ఎవరు ఇటివలి కాలంలో ప్రదర్శించలేదు.ఆరుద్ర గారు చేశినట్లు అనిపిస్తోంది.వ్యాజ నింద వ్యాజ స్తుతితో కవిత్వం చాల మంది రాస్తూ వుంటారు.అట్లాగే శ్రీనివాస్ కూడా మదర్ తెరిస్సా ను నిందిస్తున్నట్లు కనిపించిన అందులో ఆమే మానవత్వ ప్రేమ రూపాన్ని అమ్మా ..ఎంత పని చేశావ్? -అనే కవితలోఅద్భుతంగా చెక్కాడు. మీరైనా సెప్పండి-అనే కవిత కూడా స్త్రీ స్వరంలో చెప్పిన కవితే."కడుపులో ఆకలి కండ్లలో నీళ్ళతో"-వున్న ఆమెకు చేస్తున్నది తప్పు అని తెలియని తనం కాకాపోయినా ఏ రీతి బతకాలో తెలియని స్థితిలో మీరైన సెప్పమని చేసిన విన్నపాగ్నిని శ్రీనివాస్ చాల గొప్పగా చిత్రించాడు.అట్లాగే సురా శోకం వొక మంచి కవిత.అతనికే తెలియని అతని శోకం అతని భార్య,పిల్లలపాలిట శాపం."ఒక అర్థరాత్రి నా కవితలునేనే చదువుకొంటూ నా డైరీని నేనే పరిశీలిస్తూ ,అపరిపక్వతకు నవ్వుకుంటనన్నా"-అది అతని వినయమే తప్ప అపరిపక్వత కాదు.వొక కవి నుంచి ఇంకో కవి నేర్చుకోవాల్సింది ఎప్పుడూ వుంటుంది"-అన్న అఫ్సర్ మాటల్ని తిరిగి కవిసంగ మిత్ర కవులకు చెబుతు ఒక ఆలోచనాత్మక అద్భుత కావ్యాన్ని అందించినందుకు శ్రీనివాస్ ని అభినందిస్తూ..మరో మంచి కవితో వచ్చే మంగళవారం కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1igF4g8

Posted by Katta

Sasi Bala కవిత

పెదవి పలకలేని భావాలను కళ్ళు చెబుతున్నాయి మనసు చూపలేని ప్రేమను చాచిన నా చేతులు చెబుతున్నాయి నీతో పంచుకునే ప్రతి వూసూ కవితగా వెల్లి విరుస్తున్నది మామూలు మనిషిని నన్ను కవిని చేసావు గీతే గీయడం రాని నన్ను చిత్రకారుడిని చేసావు ఏమని వర్ణించను శశి బాల.........3 feb 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bTpJ0p

Posted by Katta

Krupakar Ponugoti కవిత

ఒకరోజు ఒక మాదిగ మహా కవి ఫోన్ చేసి ' ఇనాక్ గారికి పద్మశ్రీ వచ్చిం ' దని అభినందన పూర్వకమైన సంతోషం తో చెప్పాడు.నేనన్నాను కదా ' అన్నా, ఇనాక్ గారికైనా ,మీకైనా ఈ ప్రభుత్వ పురస్కారాలన్నీ చిన్నవవుతాయి,మీ ప్రతిభను ప్రభుత్వ పురస్కారాలు కొలవలేవు.పైగా మరణానంతరం కొంతమంది అగ్ర కులాల వారికి ,బతికుండగానే కొంతమంది అగ్ర కులాల కుర్రాళ్ళకీ ప్రకటించ బడుతున్న ఈ పురస్కారాల ఎంపికలో కుల వివక్షలు చోటు చేసుకుంటున్నాయి.కావాలంటే గతం లో పొందిన వారి లిస్టు తియ్యండి 'అన్నాను .ఉదాహరణకి భారత రత్న చూడండి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ గారికి ఇవ్వడం వల్ల ఈ పురస్కారానికి ఖ్యాతీ ,గౌరవం పెరిగింది .కాగా ఈ పురస్కారం అందుకున్న వారి పేర్లలో చాలా పేర్లు గమనిస్తే ,పొందిన వారిలో 'వీరూ కూడా వున్నారా?' అని సగటు భారతీయులే ఆశ్చర్య పోతారు.ఇదీ మన ప్రభుత్వ పురస్కారాల కథ. ఏమంటారు మిత్రులారా?

by Krupakar Ponugoti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bTpHps

Posted by Katta

Rajarshi Rajasekhar Reddy కవిత



by Rajarshi Rajasekhar Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1inQKOM

Posted by Katta

Vempalli Reddinagaraju కవిత

చీకటి స్వర్గం-వెలుతురు నరకం//27-9-2013//04-02-2014// ******************************* కోర్కెల కొలిమలా కాగే నరాల వెచ్చదనాన్ని చల్లబరుచుకునేందుకు నీ నగ్న దేహపు దుప్పటిని నాపై కప్పి తమకంతో తనువంతా పులకింపజేసి మరుజన్మకైనా మరచిపోలేనివిధంగా రాత్రి బెడ్ రూంలో "చీకటి"స్వర్గంచూపించావు. నువ్వుచేసిన చిలిపి పనుల తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కూరలో కాస్తంత కారం ఎక్కువ జేస్తే ఎవడి తలపుల్లో తరిస్తూ వంట పాడు చేసావేఅంటూ పగలు డైనింగ్ హాల్లో నా చెంప చెళ్ళుమనిపించి "వెలుతురు"నరకం స్రుష్టించావు బెడ్రూంలో చూపిన చీకటి" స్వర్గానికీ" డైనింగ్ హల్ల్లో స్రుష్టించిన వెలుతురు"నరకానికీ" తేడా రాత్రి నీ"అవసరపు"చేతలదా"? పగటి"పురుషాహంకారపు" చేతులదా"? ------వేంపల్లి రెడ్డినాగరాజు*--9985612167

by Vempalli Reddinagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1inQKOE

Posted by Katta

Naveen Auvusali కవిత

||నిదానం||నవీన్ అవుసలి|| ఆశయం ఆవిరవుతుందేమోననే ఆత్మఘోశ వద్దు.. ఆత్మస్ఠైర్యం సన్నగిల్లుతుందేమోననే అంతర్మథనం వద్దు.. కాలాన్ని నిర్ణయించే భూమి కూడా మెల్లిగా పరిభ్రమిస్తుంది శూన్యంలోనే... చల్లని నీడనిచ్చే పచ్చని చెట్టుకూడా మెల్లిగా మొలకేస్తుంది మట్టిలోనే...

by Naveen Auvusali



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1elOd8r

Posted by Katta

R K Chowdary Jasti కవిత

కలం నా గుండెలో వేదనని తన మనసులో నింపుకుని నా గాయాల్ని తన గేయాలుగా చేసుకుని నాలోని సంఘర్షణని తన మౌనంలోకి మార్చుకుని నా కన్నీటిని తన రక్తంగా చేసుకుని నాలోంచి తన కంటికొస నుండి కవిత్వాన్ని స్రవిస్తూ నా కలం! ఎండిపోయిన తోటని తడుపుతూ దున్నుతూ పత్రహరితాన్ని రచిస్తూ ఆ హలం! © జాస్తి రామకృష్ణ చౌదరి 02.02.2014@3.35PM

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gFg05v

Posted by Katta

Krishna Mani కవిత

రాజ్యమా ! ******** చిలవలు పలువలుగా విలువలవలువలను ఇప్పిపారెశె దుశ్యాసన పాపనాసుల కాళ్ళకింద పడి విలవిలలాడుతున్న ఓ రాజ్యమా ! నీ సంతానం చాతగాని గాంభీర్యం ! ఏలనీకే నాలుగు పాదాలు చెదలు పట్టించిన ఘనులు చేసేయన్నిచట్టాలు దోయనీకే చుట్టాలు బక్కోనికి బొక్కలు రక్షకులే ఊరేనక పెద్దబోజలు బలిసినోడి గేటు కాడ ఊరకుక్కలు లేనోడి భుమికాడ గుంత నక్కలు అడిగేటోడి నెత్తిమీద గన్ను ఎక్కులు పాతకారు ఓయి కొత్తకారు ఒచ్చె ఉన్నసైకిలు ఓయి చేత్ల చెప్పులు వట్టే బయటికేమో అందరొక్కటే లోపలేమో దొంగజేబులు సావనోని పిండానికి ఎదురుసూపులు చెప్పనీకే పాత గొప్పలు పక్కోనికి నవ్వులాటలు ఉన్మాదపు కొడుకుల తొక్కలేక సంపలేక సావలేక నలుగుతున్నవు చెప్పలేక తూట్లు వడ్డ మెరుపు వలువలొ లోకం సూడా గొప్పగున్నవె ! కృష్ణ మణి I 03-02-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gFg0m3

Posted by Katta

Kancharla Srinivas కవిత

వాకింగు జాగింగు మానేసి జనం చేస్తున్నారిపుడు అభినవ ప్రాణాయామం అధరాల వ్యాయామం.. ఇంత ముద్దుగా చెప్పాక ఎందుకు పాటించం మనం.. ఒక్కసారికే 3600 కెలోరీలు ఖర్చవుతాయట నితిన్ చెప్పాడు కాదు.. కాదు పూరీ చెప్పించాడు హార్టెటాక్ అవకండి ఇది నిజం..

by Kancharla Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MPSSV8

Posted by Katta

Vempalli Reddinagaraju కవిత

వేంపల్లి రెడ్డినాగరాజు !! మా ' స్వప్న ' o -మా ' ప్రణ ' తి !! 28-9-2013/02-02-2014 ************************ మెరిపించే మేని చాయనీ ముదుతల్లేని ముఖారవిందాన్నిచ్చే సబ్బులు కాదు ఇప్పుడు మాక్కావాల్సింది మ్రుగాళ్ళ ఆకలి చూపులతో మకిల పట్టిన శరీరాల్నీ కాంక్షల కళ్ళతో మలినపడ్డ దేహాల్నీ పరిశుభ్రం చేసే సరిక్రొత్త సబ్బులు కావాలిప్పుడు అమ్మలనూ అమ్మాయిల్లా చూపుతూ అబ్బురపరిచే టెలీవిజన్ ప్రకటనల్లోలా ' స్టార్ ' లయ్యే అవకాశాలను తెచ్హే సబ్బులు కాదు ఇప్పుడు మాక్కావాల్సింది కాలేజీ ప్రాంగణాల్లో ప్రేమించమని వేధిస్తూ వెంటబడే కామ పిశాచాలు కుమ్మరించే యాసిడ్ ద్రావకం కడవలకొద్దీ మీదబడ్డా కమిలిపోక తట్టుకునేలా మా చర్మాన్ని మరింత దళసరి చేసే క్రొంగొత్త సబ్బులు కావాలిప్పుదు పట్టులాంటి మ్రుదుత్వం ముత్తుకుంటేనే కందిపోవడం లాంతి కాసులు రాల్చుకునే కాస్మో ' ట్రిక్స్ ' పడికట్టు పదాల ఊరింపు మాటలతో దేహంపై వ్యామోహం పెంచే సబ్బులు కాదు ఇప్పుడు మాక్కావాల్సింది మోహంతో..పైశాచికానుభవ దాహంతో నవ మానవ వన మ్రుగాలు విసిరే విచ్హు కత్తుల్లంటి చూపుల పిడిబాకులకు చిద్రమవుతూ కని పెంచిన వాళ్ళకి కాటి దుఖాన్ని మిగిల్చే కూతుళ్ళుగా కాక యుద్ధ రంగంలో ఘర్జించే రుద్రమల్లా మా దేహాల్ని సన్నద్దం చేసే న్యూ ప్రోడక్షన్ కోసం ఇప్పుడు మేం ' స్వప్నించే ' ది-ఎప్పుడూ ' ప్రణతి ' oచేది (వరంగల్లు స్వప్న,ప్రణతిలు గుర్తుకు వచ్చి ) వేంపల్లి రెడ్డినాగరాజు 9985612167*

by Vempalli Reddinagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kB49Un

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

నిద్రలేవండిరా...//కన్నెగంటి జననీ శ్రీవాణి సీతమ్మ తల్లి జన్మించిన ఈపుణ్యభూమిలో స్త్రీలకు రక్షణ అందటం లేదు వరకట్న వేదింపులు మోసాలు అత్యాచారాలు,దొంగతనాలు దోపిడీలు అశాంతి అందలమెక్కి కూర్చున్నాయి మారాలి ఈపరిస్థితులు మార్పులు ఎక్కడనుంచో కాదు మన వల్లే ఈమార్పులు రావాలి చినుకు చినుకు కలిస్తే అదిఒక సాగరం చేయి చేయి కలిస్తే అది ఒక మానవహారం రండిరా.... కదలండిరా ... చైతన్యవంతులు కండిరా .. ఓ భావిభారత పౌరుల్లారా సమస్యలు అంతరించిపోయేలా సమరం చేద్దాం ఇది మన సమాజం.. ఇది మన ప్రపంచం దీనిని మనమే చక్కదిద్దుదాం నిద్రలేవండిరా ..స్త్రీలకు రక్షణ కల్పిద్దాం .. ఆనాటి గాంధీ మాటను నిలబెడదాం అత్యాచారాలు చేసే రాక్షసులను అంతం చేద్దాం మన దేశచరిత్రను కాపాడుకుందాం .! [ఇది 8వ తరగతి చదువుతున్న మా అమ్మాయి కవిత. ప్రోత్సహిస్తారని ఆశిస్తూ..]3.2.14.

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ah2KRO

Posted by Katta

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్//అమ్మతో చెప్పకు// నా నరాల్లోంచి ఒక్కో బొట్టూ నేలమీద పడుతూంటే నువ్వడిగావు కదా మిత్రమా నీ ఆఖరి కోరికెంటని వేటాడ బడ్డ సూర్యుడి శరీరం లోని ఒక ముక్కని మంటలపై కాల్చుకుతింటూ.. "అమ్మకేమైనా చెప్పాలా?" అని నువ్వడిగావ్ "బంగారి తండ్రీ నీకు బాదల్లు వద్దు బాడిశే దెబ్బకూ బందూకులెత్తూ" అని పాడేది మా అమ్మ పలాష్ చెట్టు కొమ్మకు కట్టిన ఊయల్లో నన్నూపుతూ ఎంత అందంగా ఉండేదో మా అమ్మ... ఎర్రని కుంకుమ నాన్న చొక్కాకి పూసి ఎర్రబడ్డ చెక్కిలితో నల్లని నన్నూ గుండెలకు హత్తుకొంటూ ఏమైందో మరి నాన్న పొయాక అమ్మ కళ్ళు ఎర్రబడితే తల తెల్లబడింది కుట్ట్మిషను పైనే నా బతుకునూ అందంగా కుట్టాలని ప్రయత్నించింది ఆటలో ఓడిన నాడు "బేటా గెలవానోడెవ్వడూ సచ్చిపోడు కానీ బతకనూలేడు ఓడిపొయినా ఆడాలె" అనిచెప్పిన అమ్మ దెబ్బకి కట్టు కడుతూ నా కళ్ళు తుడిచేది ఎప్పుడూ ఏడవలేదు మా అమ్మ ఏదీ ఏడిపించలేదు మా అమ్మని కానీ మిత్రమా.... ఈనాడు భయంగా ఉంది ఇదిగో... ఈ తూటా నా గుండెలో దిగబడ్డ తూటా అమ్మని ఏడిపిస్తుందేమో లెదూ బాడిశె దెబ్బకు బంధూకెత్తలేక ఓడిపొయిన. కొడుకుని కన్నావ్....! అంటూ అమ్మని ఎగతాలి చేస్తుందెమో అందుకే నా ఈ మరణాన్ని అమ్మతో చెప్పొద్దు బాలెట్ బాక్సుల్లో భందించబడ్డ భారతమాత విముక్తికోసం చూసినట్టు అమ్మని నా కోసం అలానే ఎదురు చూడనీయ్...03/02/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k0Ohww

Posted by Katta

Bhaskar Palamuru కవిత

ప్రసవ వేదన! కోట్లాది ప్రజల ఆర్తనాదం తడి ఆరని రక్తంలా అగ్ని గుండంలా మండుతూనే ఉంది తరతరాలుగా వలస ఆధిపత్యపు దొరల గడీల చెరసాలలో అపారమైన వనరులు .సమ్పదలతో అలరారిన మత్తితనం కలబోసుకున్న ఈ అరుదైన మాగాణం స్వేఛ్చ కోసం ఇంకా నినదిస్తూనే ఉంది నిప్పుల కొలిమిలా ఎగసి పడుతూ ఉద్యమ బావుటా ఎగరేసింది! బతుకులు పారేసుకున్న వాళ్ళు బందూకుల ధాటికి నేలకొరిగిన బిడ్డలు ఎందరో కళ్ళ ముందే కన్నీటి బిడ్డలు చేతికొచ్చిన కొడుకులు రాలి పోయారు మట్టిని నమ్ముకుని అడవిని ముద్దాడిన పాపానికి తూటాల తాకిడికి తట్టుకోలేక చావును హత్తుకున్నారు ! పోరాటాలకు నిలువెత్తు ఉద్యమాలకు ఊపిరి పోసింది ఈ నేలనే వేలాది మందిని పోగొట్టుకుని బొడ్రాయి దగ్గర దిక్కులెనిదై నిలబడ్డది..విపణి వీధుల్లో అంగడి సరుకై ..ఊరుమ్మడి వస్తువైంది దోపిడీకి ..దౌర్జన్యాలకు బలైపోయి ఊపిరి ఆడక కొట్టుకుంటున్నది పురిటి నొప్పులను అనుభవిస్తున్నది అధికారం .రాజ్యం మారినా దొంగలదే ఆధిపత్యం ..దొరలదే పెత్తనం ఇంకానా ఇకపై సాగదని చాటండి తెలంగాణా మనదని హెచ్చరించండి!!

by Bhaskar Palamuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1blt7V2

Posted by Katta

Ramabrahmam Varanasi కవిత

వారణాసి రామబ్రహ్మం 4-2-2014 జీవితం ఏడుస్తూ పుడతాం ఆశ పడుతూ ఎదుగుతాం అలిసిపోయాం అనుకుంటాం అయిపోయింది అనుకుంటారు

by Ramabrahmam Varanasi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cOJlqH

Posted by Katta

Girija Nookala కవిత

బార్బీ భారతి 2-2-2014 బార్బి బొమ్మ ఈ ఆధునిక యువతి ఇది గురజాడ వారి పూర్ణమ్మ కాదు బాల్య వివాహ బెడద లేదు,వంటింటి పొగ లేదు జీన్స్ వేసి షర్టు తొడిగి ప్రపంచాన్ని అరచేతిలొ పొదిగి అమాయకపు ఆలోచనలతొ గడప దాటి గగనంలొ విహరించి ఆకాశంలొ సగం మగవాడితొ సమం అని నమ్మి నిలువునా దోచబడు తున్నాది. కట్టు బొట్టు కట్టు బాట్లు లొ తప్ప తనికి వచ్చింది స్వాతంత్ర్యం కాదని అది బుడగ మీద ప్రయాణమని కామ కబంద హస్తాలకి తను పావు అని కక్ష వివక్ష కామ కాంక్షలకు బలి పశువునని మను చెప్పిన స్త్రీకి తనకి తేడా లేదని అసలు తనకి స్వాతంత్రానికి అర్హత లేనేలేదని రేపు లేని రోజు నేటి తోనె నూరేళ్ళు అని తెలియని నా బార్బి బొమ్మ మళ్ళీ మళ్ళీ దగా పడుతున్నాది ప్రతి రోజు రేప్ వార్తలు చదివి మనసు వికలమై పోతున్నాది

by Girija Nookala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MOjAgS

Posted by Katta

Panasakarla Prakash కవిత

పునర్జన్మలు జీవితమ౦త దారిని కాళ్ళీదుతున్నాయ్ హృదయమ౦త ప్రప౦చాన్ని కళ్ళు చూస్తున్నాయ్ న్యాయానికున్న గతాన్ని చెవులు వి౦టున్నాయ్ మన రాతలున్న చేతులు కవిత్వాన్ని రాస్తున్నాయ్ గత జన్మ గాలులనే నాసికా ర౦ధ్రాలు పీల్చుతున్నాయ్ ఇప్పటి వరకు నావెన్ని జన్మలు ఈ భూమిమీద దొర్లాయో అప్పటి నా గుర్తులెన్ని ఈ నేల పొరల్లో ఒదిగాయో ఏమో అవన్నీ చూసుకోవాల౦టే మళ్ళీ ఈ దేహానికి మట్టిదుప్పటికప్పి నిద్ర పుచ్చాల్సి౦దే... మట్టిలోను౦చి మొలకనై లేచి మళ్ళీ ఈ నేలను నేను ముద్దాడాల్సి౦దే...... పనసకర్ల‌ 2/2/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k0iJqQ

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: చిరునామ: కాలచక్రం కదులుతున్నది నీ సుమనోహర రూపచిత్రం నాలో నిలిచియున్నది.. కాలచక్రం కదులుతున్నది నీ వికసిత సౌందర్య విరికాంతులు నాలో మెరిసియున్నవి.. కాలచక్రం కదులుతున్నది నీ మమతల మల్లియల తేనెజల్లులు నాలో విరిసియున్నవి.. కాలచక్రం కదులుతున్నది నీ అనురాగార్తి చూడ్కులు నాలో పెనవేసియున్నవి.. కాలచక్రం కదులుతున్నది నీ నులివెచ్చని కౌగిలిన కమ్మదనం నన్ను కమ్మియున్నది.. కాలచక్రం కదులుతున్నది నీ పాలతెలుపు పద్మపు సొగసున నా ముఖచ్చాయ తళుకుమన్నది.. కాలచక్రం కదులుతున్నది హేమంత శిశిరాల్ని త్రోసిరాజని ఆమని ఆగమనం ఆవిష్కృతమయ్యింది.. కాలచక్రం కదులుతున్నది నాలో లేని నేను నీలో ఒద్దికగ ఒదిగియున్నాను.. కాలచక్రం కదులుతున్నది నీలో లేని నీవు నాలో చేరి నా హృదయ మందారపు సింధూరమై గుబాలిస్తున్నావు.. 2/2/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k0iHzh

Posted by Katta

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

||ఆకలి తీర్చా || సత్యం గడ్డమణుగు|| ********************************* పొద్దుగాలనుంచి అడుక్కున్నా ఒక్కమ్మా బువ్వెయ్యలేదు.. కడుపుల వాడెయడో అతంచుకి ఇటంచుకి తాళ్ళుగట్టి లాగేత్తుండు.. కనీతం సుక్క నీళ్లైనా గొంతుల పోద్దామని ఆ ఈదిచియరున్న పంపుగాడికి పోతే, అది గూడక అమ్మగార్ల లెక్క ఏషాలేత్తంది.. ఆళ్ళేమో ఒక్క మెతుకు ఇయ్యలే, ఇది గూడ ఒక్క సుక్క బియ్యలే.. ఔలే ఎట్తాగిత్తాయ్..? అతలే మన యవ్వారం ఎడిసిమంగి మడతాలాగుంది.. కొద్దికొద్దిగ నా వంట్ల సత్తువ తగ్గుతా ఉంది. ఆ పంపు కాడ్నే కూలబడ్డా.. పంపుని పట్టుకోనీకి శెయ్యి గూడ లెయ్యలే., అప్పుడు జూసినా ఆ పంపు కన్నంల రెండు సుక్కలున్నయ్.. అవి కాసేపట్ల కారి కింద పడతయ్.. ఎట్టాగూ తలని లేపే ఓపిక లేక నోటిని పంపుకుందకి పెట్టిన.. సరిగ్గ సుక్క రాలే టైముకి ఓ కుక్క నాలికతో ఉన్న రెండుసుక్కలూ నాకేసింది.. బారెడు నాలిక్కి ఆ రెండు సుక్కలు సరిపోక రొప్పుతా నన్ను సూతంది.. అప్పటికే కింద పడ్దప్పుడు తగిలిన దెబ్బల్నుంచి కారుతున్న రక్తం వాసన ఆ కుక్క నాసికలకి తాకింది.. చిన్నగ నా మీద ఉన్న రక్తాన్ని సుతారంగ నాకేత్తోంది ఆ కుక్క.. అది అలా నా రక్తం కోసం నా మీద పడగానే ఆ ప్రయత్నంలో అప్రయత్నంగా దాని కాలు నా ముక్కుకి రాసకపోయి రక్తం నా నోట్లోకి కారింది.. నాకు గొంతులోకి జారుతున్న ఉప్పని ద్రవం తప్ప ఇంకేమీ తెలియలేదు.. తెలుసుకునేంత తెలివి లేదు.. తెలివి రాగానే లేచి చూశాను నాకింక ప్రాణం లేదు.. ఎందుకంటే అప్పటికే ఆ కుక్క నా వొళ్ళు మొత్తం కొరికి మింగేసింది.. నిజానికి గొంతులోకి జారిన ఉప్పని ద్రవం ముక్కు మీద గాటుకి కాదు ఆ కుక్క కాటుకి వచ్చిన రక్తం.. పోన్లే నా జీవితంల అడుక్కోడమేగాని పెట్టింది లేకపాయే.. ఇట్టాగైనా పోతా పోతా ఒక జీవి ఆకలి తీర్చిన. గది సాల్ నాకు..! - సత్యం గడ్డమణుగు, 04-02-2014, 03:51

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gHyPoN

Posted by Katta

Swatee Sripada కవిత

ఈతరాని చేపనై.................. గలగలలు వినబడుతూనే ఉంటాయి స్వప్నాలు ఆవిష్కరి౦చుకు౦టున్న గులకరాళ్ళ నిశ్శబ్దం మీద వెయ్యి సముద్రాల సంభాషణ రణగొణ ధ్వనిలా కలలను తుంచి వాస్తవం చిరు జల్లుల్లో కరిగించుకుంటూ పెదవులు కదిపినది స్వప్నాలా ? సముద్రమా ? గులకరాళ్ళా ? ఆకు పచ్చ ఆలోచనలు ఆకాశానికి పందిరివేసిన చిటారుకొమ్మలకి౦ద వంపులు తిరుగుతూ సుతిమెత్తని నడకలతో సాగే ప్రవాహమై లోలోనికి చల్లగా పాకి వచ్చినప్పుడు హద్దులు లేని ఆకాశాన్ని కానుకగా ఇచ్చినపుడు నీ ఊపిరి నా శ్వాసగా జీవన ప్రాంగణాన ద్వజస్థ౦భమై మౌనమై మల్లె తీగనై మరో మాటలేకుండా అల్లుకు పోయిన క్షణాలు ఇంకా తడి తడిగా చేమ్మగిలే కళ్ళలో మసకబారి ,.......... నీకూ నాకూ మధ్యన ఎన్ని కలుపు మొక్కలు మాటలకూ చూపులకూ మొలిచిన ముళ్ళు ఏటి తరగలమై పల్చగా పరచుకునే వెన్నెల మేలిముసుగు లో చూపుల రాయభారాలకు అడ్డంగా గుర్రపు డెక్కల్లా అల్లుకుపోతూ పెరిగిన అపోహలు ఊహకందని అద్వైతంలో ఒకరికొకరు పరిచయమవుతూ మనం రెక్కలు విరిచేసి కాళ్ళు నరికేసిన సెలయేటి బురదలో మన ప్రతిబింబాలు చూస్తూ చుట్టూ ఆత్మలు లేని శరీరాలు అటూ ఇటూ ఊపి ఊపి రాల్చిన కధనాలు పోగుచేసి పూల కుప్పల నుండి ఆయుధాలు తయారీలో .......... ఇంకా లోలోపలి భరిణలో భద్రంగా దాచుకున్న కస్తూరి పరిమళాలు స్వరం సవరించుకు కూనిరాగాలే పలుకలేదు అక్షరాలూ దిద్దుకుంటున్న వేలికొసలపై కవనవనాల విరితోటలు వికసి౦చనే లేదు ఇద్దరి మధ్యనా హిమపాతమై దట్టంగా పేరుకున్న అడ్డు తెర మాటలు మూగ మేకలైనాయి మమతలు బెంగటిల్లి జ్వరపడిన పెదవులైనాయి ఎంతకని ఇలా ఎదురు చూపుల నైరాశ్యంలో ఈతరాని చేపలా .....................

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fNF5GH

Posted by Katta

Vijaykumar Amancha కవిత

//పుట్టిన ఊరు // అమ్మ పుట్టిన ఊళ్ళొనే నేను పుట్టాను మరి నాన పుట్టిన ఊరు నా స్వస్థలమెందుకౌతుందో అమ్మ పుట్టిన ఊరు అమ్మమ్మ వారి ఊరు అవుతుంది నాన పుట్టిన ఊరు నా ఊరు అవుతుంది ఎందుకు ..ఎందుకు..ఎందుకలా // విజయ్ కుమార్ //

by Vijaykumar Amancha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j7ezx2

Posted by Katta