ఈతరాని చేపనై.................. గలగలలు వినబడుతూనే ఉంటాయి స్వప్నాలు ఆవిష్కరి౦చుకు౦టున్న గులకరాళ్ళ నిశ్శబ్దం మీద వెయ్యి సముద్రాల సంభాషణ రణగొణ ధ్వనిలా కలలను తుంచి వాస్తవం చిరు జల్లుల్లో కరిగించుకుంటూ పెదవులు కదిపినది స్వప్నాలా ? సముద్రమా ? గులకరాళ్ళా ? ఆకు పచ్చ ఆలోచనలు ఆకాశానికి పందిరివేసిన చిటారుకొమ్మలకి౦ద వంపులు తిరుగుతూ సుతిమెత్తని నడకలతో సాగే ప్రవాహమై లోలోనికి చల్లగా పాకి వచ్చినప్పుడు హద్దులు లేని ఆకాశాన్ని కానుకగా ఇచ్చినపుడు నీ ఊపిరి నా శ్వాసగా జీవన ప్రాంగణాన ద్వజస్థ౦భమై మౌనమై మల్లె తీగనై మరో మాటలేకుండా అల్లుకు పోయిన క్షణాలు ఇంకా తడి తడిగా చేమ్మగిలే కళ్ళలో మసకబారి ,.......... నీకూ నాకూ మధ్యన ఎన్ని కలుపు మొక్కలు మాటలకూ చూపులకూ మొలిచిన ముళ్ళు ఏటి తరగలమై పల్చగా పరచుకునే వెన్నెల మేలిముసుగు లో చూపుల రాయభారాలకు అడ్డంగా గుర్రపు డెక్కల్లా అల్లుకుపోతూ పెరిగిన అపోహలు ఊహకందని అద్వైతంలో ఒకరికొకరు పరిచయమవుతూ మనం రెక్కలు విరిచేసి కాళ్ళు నరికేసిన సెలయేటి బురదలో మన ప్రతిబింబాలు చూస్తూ చుట్టూ ఆత్మలు లేని శరీరాలు అటూ ఇటూ ఊపి ఊపి రాల్చిన కధనాలు పోగుచేసి పూల కుప్పల నుండి ఆయుధాలు తయారీలో .......... ఇంకా లోలోపలి భరిణలో భద్రంగా దాచుకున్న కస్తూరి పరిమళాలు స్వరం సవరించుకు కూనిరాగాలే పలుకలేదు అక్షరాలూ దిద్దుకుంటున్న వేలికొసలపై కవనవనాల విరితోటలు వికసి౦చనే లేదు ఇద్దరి మధ్యనా హిమపాతమై దట్టంగా పేరుకున్న అడ్డు తెర మాటలు మూగ మేకలైనాయి మమతలు బెంగటిల్లి జ్వరపడిన పెదవులైనాయి ఎంతకని ఇలా ఎదురు చూపుల నైరాశ్యంలో ఈతరాని చేపలా .....................
by Swatee Sripada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fNF5GH
Posted by Katta
by Swatee Sripada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fNF5GH
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి