పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Bhaskar Palamuru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bhaskar Palamuru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జూన్ 2014, ఆదివారం

Bhaskar Palamuru కవిత

ప్రక్రుతి ప్రకోపం..సర్కార్ శాపం! ------------------------------- నీకు ఏమైతేనేం వాళ్ళ మానాన వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అదే పది వేలు రేయనక పగలనక నువ్వు మట్టిలోనే కలిసిపోతే కాసిన్ని మెతుకుల కోసం నీవు నేలరాలి పోతే వాళ్ళకు ఎందుకు వాళ్ళు బాగుంటే చాలు రోజుకో మాట ..పూటకో అబద్దం తమ పదవులు తమకుంటే చాలు నువ్వు ఏమై పోతేనేం అప్పుడే కుర్చీల కోసం కొట్లాట నీకు యేపదవి నాకు ఏ పదవి భూమిని భుజానికి ఎత్తుకుని గుండెల్లో దుఖాన్ని బిగపట్టుకుని నీవు కన్నీళ్ళతో సాగుతూ ఉంటే వాళ్ళు మాత్రం హామీల వర్షాన్ని కురిపిస్తారు మాయ మాటలతో మేస్మరైస్ చేసేస్తారు ఇదేనా మనం కోరుకున్న బంగారు తెలంగాణా ఇందుకేనా మనం కడుపు కాలి అప్పులు తీర్చలేక రాలిపోతూ ఉంటే వాళ్ళు మాత్రం సొల్లు కబుర్లతో సద్ది కథలతో పొద్దు గడుపుతూ అరచేతుల్లో స్వర్గం చూపిస్తూ గారడీ చేస్తూ .. పిట్టల దొరల్లా వేషాలతో వెకిలితనంతో తెలంగాణా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు ఇక చాలించండి ..మీ సాయం మాకొద్దు మమ్మల్ని మనుషులుగా చూడండి చాలు !!

by Bhaskar Palamuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kVZfi1

Posted by Katta

6, జూన్ 2014, శుక్రవారం

Bhaskar Palamuru కవిత

భరోసా ఇవ్వండి ---------------- పొద్దు పొడిస్తే వాళ్ళు మట్టిని ముద్దడుతారు రాత్రి పలకరించినా సరే ఆ నేలలోనే సొమ్మసిల్లిపొయినా సరే అక్కడే ఉండి పోతారు భూమి ఓ సజీవ జీవ నది అది మట్టి బిడ్డలకు అక్షయపాత్ర కూడు పెట్టేది .. కడుపు నింపేది అదే అందుకే వాళ్ళు అలుపెరుగక రేయింబవళ్ళు కలిసిపోతారు కన్నీళ్లను దాచుకుని మట్టితనం కలబోసుకుని సాగిపోతారు భూమి స్వప్నం కాదు అదో యుద్ధ భూమి కాటికి వెళ్ళినా సరే మట్టితోనే బంధం లోకానికి అన్నం పెట్టే అన్నదాతలపై ఎందుకు ఇన్ని కట్టుబాట్లు వాళ్ళు భూమి పుత్రులు ఇకనైనా మేల్కోండి వాళ్ళు బతికేందుకు భరోసా ఇవ్వండి కానీ జాలి మాత్రం చూపించకండి !!

by Bhaskar Palamuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oiqRUy

Posted by Katta

12, మార్చి 2014, బుధవారం

Bhaskar Palamuru కవిత

ఏదో ఒక రోజు వెళ్లి పోవాల్సిందే కదూ అందుకే ఈ ఆరాటం వద్దుకున్నా అదేదో గుండెను కెలుకుతూనే ఉంటుంది ఓ కొక్కెంలా గాలిపటంలా రివ్వుమంటూ దూసుకుపోతూ కవ్విస్తూ కలవరించేలా చేస్తూ పలకరిస్తుంది! అంతిమ యాత్రలో ఎన్ని ఆలోచనలో ఒక పట్టాన ఉండనీయవు ఒకే చోట కుదురుగా నిలువనీయవు ఒక్కోసారి ఉన్నట్టుండి ఆగిపోతాం అనుకోకుండానే మనలోకి ఆహ్వానిస్తాం అంతలోపే తెలియకుండానే ఊహల్లో విహరిస్తాం బంధనాలు లేని లోకం కదూ ఒక్కోసారి తప్పదనుకున్నా అభిమానిస్తూ.. ప్రేమిస్తూ రాలిపోతాం.. ఇదేనేమో బతుకంటే ! సాంగత్యం కంటే సాహచర్యం చాలా కష్టం కుడురుకోవటం మరీ కష్టం అప్పుడప్పుడు చిన్ని చిన్ని ఆనందాలు ఆవిరై పోతున్నప్పుడు లోలోపట దాచుకున్న మనుషుల రూపాలు వాళ్ళతో గడిపిన క్షణాలు ఏకాంతంలో ఒక్కటై పోయిన జ్ఞాపకాలు అన్నీ దారాల్లా కదలాడుతై ! ఓ నవ్వు ఓ చూపు పెదవుల అంచున రాలిన మాటల మూట కొనదేరిన కనురెప్పల్లో దాగిన మొహమాటం స్వాంతన చేకూర్చే గుండెలు మళ్ళీ మళ్ళీ వెంటాడే కళ్ళు విడిచి ఉండలేని స్థితికి చేర్చే దేహ భాష అందుకే బతుకంటే ఇష్టం నువ్వంటే చచ్చేంత మోహం!!

by Bhaskar Palamuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lTPCXb

Posted by Katta

11, మార్చి 2014, మంగళవారం

Bhaskar Palamuru కవిత

ఒకరి కోసం మరొకరం వేచి చూడటమే కదా ప్రేమంటే దారులు వేరైనప్పుడు ఆలోచనలు అల్లకల్లోలంలా మారినప్పుడు దేహాలు వెదుకుతూనే ఉంటాయి కళ్ళు ఆలింగనంలో అరమోడ్పులై పోతాయి నీ కోసం నేను నా కోసం నీవు అనుకుంటూ సాగిపోతూ కదులుతూ .. పారే ప్రవాహంలా చూపులు వాలి పోతాయి ఏదో మార్మికత్వం మైకంలా అల్లుకుపోతుంది గుండెల్లో అలజడులు రేపుతుంది ఆశలు చినుకుల్లా కోరికలు ముల్లులా గుచ్చుకుంటాయి .. అయినా ఆరాటం ఆగదు ఆనందం ఆవిరైపోయినప్పుడు కనురెప్పలు దేహాన్ని తాకుతాయి అక్కడక్కడా నక్షత్రాల్లా నిమురుతాయి .. ఓహ్ ప్రేమ జీవన మాధుర్యాన్ని వెలిగించే దీపం కదా అందుకే అదంటే అందరికి ఇష్టం!

by Bhaskar Palamuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NUpOvT

Posted by Katta

8, మార్చి 2014, శనివారం

Bhaskar Palamuru కవిత

అంతటా ఆమే! ఓ చిరునవ్వు ఓ జ్ఞాపకాల పొదరిల్లు అప్పుడప్పుడు ఆనందాల హరివిల్లు ఒక్కోసారి చూడకుండా ఉండలేని స్థితి ఒంకొసారి వద్దనుకున్నా దాచుకోలేని పరిస్థితి సమూహంలో నైనా ఒంటరితనంలో సైతం ఓదార్పును దుఃఖంలో నేనున్నానంటూ భరోసా కల్పించే ఒకే ఒక్క సాధనం ఆమే ప్రాణంలో ప్రేమతనం ప్రేమలో గుప్పెడు అమ్మతనం కలిసి పోయినప్పుడు కలవాలని తపించినప్పుడు అన్నీ ఆమెనే ఆకాశంలో ఆమె సగం కానే కాదు ఈ లోకం .. ఈ ప్రపపంచం అన్నీ ఆమే తను కరిగి పది మందికి ప్రాణం పోసి ప్రేమను పంచి తను కోల్పోయి పదుగురికి వెలుగులు పంచే ఆమెకు ఒక రోజు ఏమిటి అన్ని రోజులు ఆమెవే తల్లి ..చెల్లి. చెలి ..నెచ్చెలి సహచరి .. లోహపు తంత్రులను మీటే ఆమెకు వందనం అవును ఆమె లేకుండా నేనుండలేను .. బతకలేను !

by Bhaskar Palamuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dB4BAk

Posted by Katta

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Bhaskar Palamuru కవిత

సన్నని వెలుతురు ఇసుక వేస్తే రాలనంత నిశ్శభ్డం నాలుగు గోడల మధ్యన ఆశ నిరాశల మధ్యన రాలిపోతున్న ఆరాటాలు ఎగసి పడుతున్న అలల్లా పారేసుకున్నకోరికల్లా పొలాల వెంట పరుగులు తీసే లేగ దూడల్లా నింగిలో ఉవ్వెత్తున నిలిచే మువ్వొన్నెల పతాకంలా మెలమెల్లగా సన్నని గొంతు లోంచి రాగం తాకుతుంది! తనువంతా తమకంతో మరో తోడు కోసం లతలా అల్లుకు పోవాలని ఆరాట పడుతుంది గుండె గుండెలో ప్రేమను చల్లుకుంటూ సాగుతుంది ఏ దేవుడు చేతిలో రూపొందిన బొమ్మవో ఏ శిల్పి చేతిలో కదిలిన కుంచెవో గది నిండా గానపు పరిమళం గువ్వలా అంటుకుంటుంది ! వెలుతురూ వేకువా ఒక్కటయి పోయినట్టు ఆ గాత్రపు దరహాసం పెదవుల మీద ముద్దాడుతుంది మువ్వగా మారి పాదాల చెంతన సిరిమువ్వై అల్లుకుంటుంది ఆ బహుదూరపు బాటసారి మార్మికపు గాన గాంధర్వపు గానం వివశత్వంలోకి జారుకునేలా చేస్తుంది పాటంటే బతుకు పండుగ మనసు జాతర హృదయపు సంత రెండు గుండెల కుసుమ పరాగం లోకాన్ని వెలిగించే దీపం !!

by Bhaskar Palamuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cfFvc2

Posted by Katta

27, ఫిబ్రవరి 2014, గురువారం

Bhaskar Palamuru కవిత

పల్లె ఉత్సవం! మాయా మర్మం ఎరుగని మట్టి బిడ్డలు వానొస్తే ఆనందం సూర్యుడు ఉదయిస్తే సంతోషం కల్లా కపటం తెలీని అచ్చమైన గువ్వ పిట్టలు ఎల్లలు ఎరుగని భూమి పుత్రులు కాలం కాటు వేసినా గుండెల్లో మంటలు చెలరేగినా కన్నీళ్లు జారిపోతున్నా పల్లెజనం ఒక్కటై పోతారు తమ తరం మిగిల్చిన అనుభవాలను నెమరు వేసుకుంటారు! ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర ఊరు ఉప్పెనవుతుంది మరోసారి జాతరై అల్లుకుపోతుంది అదే పల్లెతనానికున్న గొప్పదనం మనుషులంతా పక్షులై పోయేది కులమతాలకు అతీతంగా జంగు సైరన్ లా సాగి పోయేది ఎప్పుడో తెల్లారి పోయే బతుకులు కావు వాళ్ళవి చివరి బంధాన్ని సైతం గుర్తు చేసే కాకులను ప్రేమించే అమ్మతనం వాళ్ళ స్వంతం ! వారం వారం జరిగే సంత వాళ్ళకో వేదిక ఏడాదికో సారి తిరునాళ్ళ జాతర వాళ్ళ బతుకులన్నీ ఏకమయ్యే ఏకునాదం మోత అది తోరణాలు పల్లవించే మట్టితనం వాళ్ళ కలివిడితనం అదే పల్లె బతుకుల ఆనంద తాండవం మరువలేని జ్ఞాపకం!!

by Bhaskar Palamuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mFHIhP

Posted by Katta

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

Bhaskar Palamuru కవిత

పూల చాదర్ ! ఈర్ష్యా విద్వేషాలతో రగిలి పోతున్న వేళ ఈ నగరం ప్రేమను పంచింది వేలాది ప్రజల గుండెల్లో రాగాలను అద్దింది ఇది నగరమా లేక మానవ సమూహమా కానే కాదు ప్రేమికుల ఆత్మల సంగమానికి ప్రతిరూపం .. భాగ్యనగరం రక్తపు చుక్కలు నేలపై రాలినా తనలోనే ఇముడ్చుకుంది ఘనమైన చరిత్ర ఈ మట్టి స్వంతం మోసం చేసినా.. కుట్రలు పన్నినా ప్రపంచపు వాకిట నిటారుగా నిలబడ్డది కోట్లాది ప్రజలకు బతుకునిచ్చింది .. భరోసా కల్పించింది అవసరమైతే బందూకు బలాన్ని నేర్పింది తరాలు గడిచినా ఇంకా ఈ భూమి ప్రేమికుల స్వర్గంగా మారింది భాగ్ మతి ప్రేమకు ప్రతిరూపంగా నేటికీ పాఠంగా నిలిచే ఉంది ఏ దారుల .. రహదారుల వెంట నడిచినా పాట్రిక్ ప్రేమ పూల చాదర్ లా వెంటాడుతోంది!

by Bhaskar Palamuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m2B3BC

Posted by Katta

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

Bhaskar Palamuru కవిత

ప్రసవ వేదన! కోట్లాది ప్రజల ఆర్తనాదం తడి ఆరని రక్తంలా అగ్ని గుండంలా మండుతూనే ఉంది తరతరాలుగా వలస ఆధిపత్యపు దొరల గడీల చెరసాలలో అపారమైన వనరులు .సమ్పదలతో అలరారిన మత్తితనం కలబోసుకున్న ఈ అరుదైన మాగాణం స్వేఛ్చ కోసం ఇంకా నినదిస్తూనే ఉంది నిప్పుల కొలిమిలా ఎగసి పడుతూ ఉద్యమ బావుటా ఎగరేసింది! బతుకులు పారేసుకున్న వాళ్ళు బందూకుల ధాటికి నేలకొరిగిన బిడ్డలు ఎందరో కళ్ళ ముందే కన్నీటి బిడ్డలు చేతికొచ్చిన కొడుకులు రాలి పోయారు మట్టిని నమ్ముకుని అడవిని ముద్దాడిన పాపానికి తూటాల తాకిడికి తట్టుకోలేక చావును హత్తుకున్నారు ! పోరాటాలకు నిలువెత్తు ఉద్యమాలకు ఊపిరి పోసింది ఈ నేలనే వేలాది మందిని పోగొట్టుకుని బొడ్రాయి దగ్గర దిక్కులెనిదై నిలబడ్డది..విపణి వీధుల్లో అంగడి సరుకై ..ఊరుమ్మడి వస్తువైంది దోపిడీకి ..దౌర్జన్యాలకు బలైపోయి ఊపిరి ఆడక కొట్టుకుంటున్నది పురిటి నొప్పులను అనుభవిస్తున్నది అధికారం .రాజ్యం మారినా దొంగలదే ఆధిపత్యం ..దొరలదే పెత్తనం ఇంకానా ఇకపై సాగదని చాటండి తెలంగాణా మనదని హెచ్చరించండి!!

by Bhaskar Palamuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1blt7V2

Posted by Katta

3, ఫిబ్రవరి 2014, సోమవారం

Bhaskar Palamuru కవిత

ప్రసవ వేదన! కోట్లాది ప్రజల ఆర్తనాదం తడి ఆరని రక్తంలా అగ్ని గుండంలా మండుతూనే ఉంది తరతరాలుగా వలస ఆధిపత్యపు దొరల గడీల చెరసాలలో అపారమైన వనరులు .సమ్పదలతో అలరారిన మత్తితనం కలబోసుకున్న ఈ అరుదైన మాగాణం స్వేఛ్చ కోసం ఇంకా నినదిస్తూనే ఉంది నిప్పుల కొలిమిలా ఎగసి పడుతూ ఉద్యమ బావుటా ఎగరేసింది! బతుకులు పారేసుకున్న వాళ్ళు బందూకుల ధాటికి నేలకొరిగిన బిడ్డలు ఎందరో కళ్ళ ముందే కన్నీటి బిడ్డలు చేతికొచ్చిన కొడుకులు రాలి పోయారు మట్టిని నమ్ముకుని అడవిని ముద్దాడిన పాపానికి తూటాల తాకిడికి తట్టుకోలేక చావును హత్తుకున్నారు ! పోరాటాలకు నిలువెత్తు ఉద్యమాలకు ఊపిరి పోసింది ఈ నేలనే వేలాది మందిని పోగొట్టుకుని బొడ్రాయి దగ్గర దిక్కులెనిదై నిలబడ్డది..విపణి వీధుల్లో అంగడి సరుకై ..ఊరుమ్మడి వస్తువైంది దోపిడీకి ..దౌర్జన్యాలకు బలైపోయి ఊపిరి ఆడక కొట్టుకుంటున్నది పురిటి నొప్పులను అనుభవిస్తున్నది అధికారం .రాజ్యం మారినా దొంగలదే ఆధిపత్యం ..దొరలదే పెత్తనం ఇంకానా ఇకపై సాగదని చాటండి తెలంగాణా మనదని హెచ్చరించండి!!

by Bhaskar Palamuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1blt7V2

Posted by Katta