కొంతం వేంకటేశ్: చిరునామ: కాలచక్రం కదులుతున్నది నీ సుమనోహర రూపచిత్రం నాలో నిలిచియున్నది.. కాలచక్రం కదులుతున్నది నీ వికసిత సౌందర్య విరికాంతులు నాలో మెరిసియున్నవి.. కాలచక్రం కదులుతున్నది నీ మమతల మల్లియల తేనెజల్లులు నాలో విరిసియున్నవి.. కాలచక్రం కదులుతున్నది నీ అనురాగార్తి చూడ్కులు నాలో పెనవేసియున్నవి.. కాలచక్రం కదులుతున్నది నీ నులివెచ్చని కౌగిలిన కమ్మదనం నన్ను కమ్మియున్నది.. కాలచక్రం కదులుతున్నది నీ పాలతెలుపు పద్మపు సొగసున నా ముఖచ్చాయ తళుకుమన్నది.. కాలచక్రం కదులుతున్నది హేమంత శిశిరాల్ని త్రోసిరాజని ఆమని ఆగమనం ఆవిష్కృతమయ్యింది.. కాలచక్రం కదులుతున్నది నాలో లేని నేను నీలో ఒద్దికగ ఒదిగియున్నాను.. కాలచక్రం కదులుతున్నది నీలో లేని నీవు నాలో చేరి నా హృదయ మందారపు సింధూరమై గుబాలిస్తున్నావు.. 2/2/2014
by Kontham Venkatesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k0iHzh
Posted by Katta
by Kontham Venkatesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k0iHzh
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి