పునర్జన్మలు జీవితమ౦త దారిని కాళ్ళీదుతున్నాయ్ హృదయమ౦త ప్రప౦చాన్ని కళ్ళు చూస్తున్నాయ్ న్యాయానికున్న గతాన్ని చెవులు వి౦టున్నాయ్ మన రాతలున్న చేతులు కవిత్వాన్ని రాస్తున్నాయ్ గత జన్మ గాలులనే నాసికా ర౦ధ్రాలు పీల్చుతున్నాయ్ ఇప్పటి వరకు నావెన్ని జన్మలు ఈ భూమిమీద దొర్లాయో అప్పటి నా గుర్తులెన్ని ఈ నేల పొరల్లో ఒదిగాయో ఏమో అవన్నీ చూసుకోవాల౦టే మళ్ళీ ఈ దేహానికి మట్టిదుప్పటికప్పి నిద్ర పుచ్చాల్సి౦దే... మట్టిలోను౦చి మొలకనై లేచి మళ్ళీ ఈ నేలను నేను ముద్దాడాల్సి౦దే...... పనసకర్ల 2/2/2014
by Panasakarla Prakash
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k0iJqQ
Posted by Katta
by Panasakarla Prakash
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k0iJqQ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి