పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, ఏప్రిల్ 2014, శనివారం

Kapila Ramkumar కవిత

భవానీ ఫణి ||కోపం||| కోపం ఉంచవచ్చు కానీ అది అద్దం మీంచి జారిపోయే నీటి బిందువులా ఉండాలి తప్ప తారాజువ్వని అంటించే నిప్పురవ్వలా కాదు కాలువలో పరవళ్ళు తొక్కే కొత్తనీరులా ఉండాలి తప్ప భూకంపం తర్వాత వచ్చే సునామీ లా కాదు పులిహోరలో కలిసి మెత్తబడిపోయే పోపులా ఉండాలి తప్ప అన్నంలోనో, పప్పులోనో నక్కి పంటికింద పడే తెల్లని రాయిలా కాదు గోడకేసి కొట్టిన రబ్బరు బంతిలా ఉండాలి తప్ప లక్ష్యాన్ని తునాతునకలు చేసే బాణపు మొనలా ఉండకూడదు శీతాకాలపు పలుచని ఎండలా చురుక్కుమనిపించాలి తప్ప వడదెబ్బతో నిర్జీవం చేసే గ్రీష్మ ప్రతాపంలా ఉండకూడదు దువ్వెనని ఇబ్బందిపెట్టే గిరజాల జుట్టు చిక్కులా ఉండాలి తప్ప ఎంతకీ విడదియ్యలేని చిక్కుముడిలా ఉండకూడదు కోపం అనేది మన మనసుకి తగిలిన గాయాన్ని మాన్పేటందుకు బహిర్గతమవ్వాలి తప్ప దావానలంలా వ్యాపించి మనతో పాటు పక్కవారిని కూడా మాడ్చి మసి చెయ్యకూడదు 9441555402 !!!http://ift.tt/PcN8pe

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PcN8pe

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి