లక్ష్మణ్ స్వామి || అన్నదాతకు వందనం !! || నీ కండల్ని చీల్చుకుని వచ్చిన స్వేద బింధువు పంటకి ప్రాణం పోస్తుంది ...! దివారాత్రులు నీ దేహం, ప్రాణం, ఆశ, ఆశయం అన్నీ మాకన్నం పెట్టడానికే !!? మెతుకు మెతుకులో మెరిసే నీ స్వేద నాదాన్ని చూసి నా గుండెల్లో నుండి, నీ పాదాలా వేపు నా పదాలు పొంగుకొస్తునే ఉన్నాయి ..!! అవనిని ఆమని చేస్తూ ...యామినైన నీ జీవనం !! యుగ యుగాలుగా దగా పడుతున్న నీ దగ్ధ జీవనం నవ జగాన నీ కష్టాల ఎడారిలో జడివాన కురవాలి !! రైతే రాజంటూ బొంకే రాక్షస లోకంలో రాజుకైనా ప్రాణ ‘భిక్ష’ పెట్టే రైతే ... రుణాల బాధకి పంట చేలల్లో ప్రాణాలు తీసుకుంటే .... అన్నంలో నుండి ఆర్తనాదం కన్నీటి దారై .... నన్ను దహిస్తూ ..!! ------------------------------ 4 – 4 - 2014
by Laxman Swamy Simhachalam
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1je61Cs
Posted by Katta
by Laxman Swamy Simhachalam
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1je61Cs
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి