_ పనిలో_ నరాలనవే తెంచుకునేలా నిజం వేట మానేస్తే మిగిలే తృప్తివ్వని నిజంలో అంతా సవ్యమే!! కడుపుమంటలు నిన్ను నువ్వు చూస్కుంటే రావు మరి.. మింగలేనితనంలో నువ్వు కక్కే కన్నీటికి తెలుసు వాటిని తోడిన ఊరి కళ్ళేవో!! బతికున్నోళ్ళలో చావునెతుక్కునే నీ ఉద్వేగపు అసూయానందంలో అంతా భావ్యమే!! నీ చితిమంటలారేలోపు చేరలేని తీరాలేవీ దరికి రావు మరి.. చేరలేనితనంలో నువ్వు కోరే తీరాలకు తెలుసు వాటిని చేరే దార్లేవో!! పరానుగుణమై ఆరాధనకెదురుచూసే లాలస పార్థక్యంలో అంతా దివ్యమే!! నువ్వు తన్నాలనుకునే వారు తప్ప నిన్ను తన్నేవారు లేరు మరి.. తన్నలేనితనంలో నువ్వు కోరే ఆరాధనకు తెలుసు నిన్ను తన్నేదెవరో!! రేపు నేడవుతుందో , నేడు నిన్నవుతుందో తెలియని దుర్లభంలో అంతా నవ్యమే!! నువ్వు తృప్తిని పీల్చే వరకు ఆగమనే క్షణాలు లేవు మరి.. ఆగలేనితనంలో నువ్వు పీల్చని తృప్తికి తెలుసు అసలు తృప్తే లేని పనిలో క్షణమే లేని నువ్వెవరో!!________(4/5/14)
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qbQtBY
Posted by Katta
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qbQtBY
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి