సాయి పద్మ // నేనూ- నా చుంపాత ముతక పరికిణీ కచ్చపోసి కట్టి నాన్న బుష్కోటు పైన తొడిగి ,పైగా గళ్ళ తువ్వాలు భుజానేసి పగుళ్ళు పట్టిన కాళ్ళతో ,సిమెంట్ దూరిన గోళ్ళతో వాడిపోయిన మల్లెల దండతో, ఎండకి మాడిపోయిన మొహంతో చెమటకి తడిసి రంగుమారి వదులైన బట్టలతో, తిరిగే నేను, ఆ కామపు దున్నపోతుని యెట్ల రెచ్చగొట్టానో అర్ధం కాలేదు రెచ్చగొట్టటానికి ఆకారం తెలీకపోయినా ఆడపిల్లయితే చాలని అప్పుడు అర్ధం కాలేదు నిత్యం నే నెత్తిన పెట్టి తిరిగే నా చుమ్పాత నా మాడుకి గొడుగయ్యింది ఎండ గాడ్పుకి చల్లటి చలివెంద్రమైంది ఆకలి చూపులని వడపోసే ఆచ్చాదన అయింది ఇంతేనా ..ఇంతేనా దున్నపోతు మేస్త్రీ నా కొడుకు మస్తరేస్తానంటూ కన్ను మలిపితే, విసిరికొట్టే చర్నాకోలయింది తాగుబోతు కూలీల విసురు మాటలకి కనబడని ఖడ్గమైంది అంతేనా .. అంతేనా చిరగని బట్టల్లో నన్ను రేచ్చగోట్టావంటూ మునిమాపు వేళల్లో , కళ్ళూ మనసూ మూసుకుపోయి ఓ మృగం నన్ను నలిపెస్తుంటే వాడి మగతానానికి వురేసే ఉరితాడయింది నా చుంపాత ఉరి పడ్డ మగతనంతో లుంగలు తిరుగుతూ వాడు నన్ను రక్షించుకోగల ధైర్యంతో నేను ఇప్పుడు ఎప్పుడు బయటికెళ్ళినా నా చుంపాత మర్చిపోను అది నన్నెప్పుడూ మోసం చేయదు ..! ఎందుకంటె ... పద్యంలో నాకు నమ్మకం లేదు గద్యం , నా మీద దాడి చేసిన వాడి గరుకు గడ్డంలా నన్నెప్పుడూ బాధిస్తూనే ఉంది అక్షరం - నువ్వు చాలీ చాలని బట్టల్లో నన్ను రేచ్చగోట్టావంటూ పలికే చాతకాని మాటల్లా నంగిగా నవ్వుతుంది --సాయి పద్మ ( తన మీద దాడి చేసిన వాడ్ని, తన తలకు బరువులు మోసేందుకు వీలుగా పెట్టుకున్న తువ్వాలు గుడ్డ తో, అతని పురుషాంగాన్ని బిగించి, తనని తాను రక్షించుకున్న ఒక చెల్లెలికి వందనాలతో.. )
by Sai Padma
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jh5LCH
Posted by Katta
by Sai Padma
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jh5LCH
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి