పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, ఏప్రిల్ 2014, శనివారం

Kamal Lakshman కవిత

అంగడి బొమ్మలు.........కమల్ లక్ష్మణ్ ఎక్కడ లేదు వ్యభిచారం.. ఎవరు చేయట్లేదు వ్యభిచారం సూటు, బూటు, కోటు వేసుకున్న దగాకోరుల కన్నా చదువు, ఉద్యోగం, పెళ్లి, పేరిట జరిగే వ్యాపారం కన్నా ప్రజా సేవంటూ చేసే పరమ నీచ రాజకీయాల కన్నా పచ్చని నోట్ల కోసం పార్చే నెత్తుటేరుల నరమేధం కన్నా పశు కాంక్షలతో పసి కందులపై జరిగే పరమకిరాతకాల కన్నా అందలమెక్కిన అందమైన అర్హతలున్న కుసంస్కారుల కన్నా నీతులు చెప్పి గోతులు తీసే టక్కరి నక్కల కన్నా కల్తీలతో కర్కశంగా కడుపు కోతలు కోసే రాక్షసుల కన్నా తమ కడుపుల కోసం పరుల కడుపులు కొట్టే బడా బాబుల కన్నా మా తనువులనమ్ముకుని వెలుగులనిచ్చే కొవ్వొత్తులలా ఆకలి కేకలతో చేసే... కడుపులు నింపే మా ఈ వ్యభిచారమో లెక్కా...! కమల్ 05.04.2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hghgMb

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి