పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, ఏప్రిల్ 2014, శనివారం

Viswanath Goud కవిత

విశ్వ మాలికలు 1.అలుకలకీ.... కులుకెక్కువయింది..! నీ సరసన వాటికీ చోటిచ్చినందుకు.!! 2.పగలే వెన్నెల కాయడమంటే ఇదే...! నువ్వు నా ముందు సాక్షాత్కరించావుగా..!! 3.నీ శరీరం చావును జయించాలంటే.... అవయవదానం చెయ్యి, తిరిగి ప్రాణం పొయ్యి.!! 4.వన్నెల వాగువే వలపుల పొంగిస్తూ 5.మతి తప్పిన మనసు గతితప్పిన కలలతో 6.నీరాకతో మదికి జాతరొచ్చింది..! వినపడడం లేదా....కొట్టుకుంటున్న హృదయస్పందనల డప్పు చప్పుడు..!! 7.మల్లెల మాలికవే...! సుగంధాల కవితాక్షరాలను నాహృదయఫలకంపై వెదజల్లుతూ.!! 8.కలలు కరుస్తున్నాయి..! నువ్వేమైనా ఉసిగొల్పావా? 9.నీ బిడియానికెన్ని భావాలో.. ఇష్టమో,కష్టమో అర్థం కాక నా మదిని తికమకపెడుతూ.! 10.నీ జ్ఞాపకాలు కమ్మేసాయి మనసంతా... తనువంతా ఆనందపు జడివాన కురిపిస్తూ.! 11.స్మశానవాసినే...! జీవంలేని ఆశల మద్య జీవించేస్తూ..!! 12.రెండు సుడులున్నాయి..! ఒక్క పెళ్ళైనా కావట్లేదింకా ఏంటో......! 13.ఊహల ఊరేగింపు.! నీజ్ఞాపకాలకు పట్టంకడుతూ.!! 14.నాగుండె కల్లోలకడలే.! నీజ్ఞాపకాల కెరటాలు నిత్యం హోరెత్తుతుంటే.!! 15.సాగుతూనే ఉంటుంది కాలం.! కాలంతీరిన వారిని సాగనంపుతూ..!! 16.వారాలబ్బాయ్ చంద్రుడు..! సగంరోజులు వెన్నెలింట్లో, మిగతాసగం అమాసింట్లో.!! 17.చీకటిని హత్య చేసొచ్చాడు సూరీడు..! చూడు నెత్తుటి కత్తుల కిరణాలతో,ఒళ్ళంతా రుధిరంతో ఎలా ఎర్రబడ్డాడో..!! 18.నాఊహలకు అక్షరాలు కరువయ్యాయి..! చిత్రం....మదిపుస్తక పుటలన్నీ అమాంతం నిండిపోయాయి నీజ్ఞాపకంతో.!! 19.కళ్ళ పొలిమేర దాటని కలలు... ఎక్కడ పుట్టాయో అక్కడే సమాధవుతూ.!! 20.చీకటి చేలో చుక్కల వానజల్లులు కురిసాయి.! మొలకెత్తిన వెలుగులకు చంద్రుడు కాపలాదారు.!! 21.ఆమె ఒక పాలకడలి..! తన జీవితాన్ని మదించి అమృతమంటి ప్రేమ పంచుతుంది.!! 22.నా సహచరిణిది ద్విపాత్రాభినయం..! గారాలు పోవడంలో ప్రేయసిగా, గారంగా చూసుకోవడంలో అమ్మగా.!! 23.ఓర్చుకోవడం ఏ గురువు వద్ద నేర్చుకుందో...! గుండెల్లో అగ్నిపర్వతం బ్రద్దలవుతున్నా చలించదు స్త్రీ. విశ్వనాథ్ 05APR14

by Viswanath Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jgMTDL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి