..................అమే.....................విజయ్(24.05.14 నుంచి 01.06.14) మెర్క్యూరి లైట్ల దగదగల క్రింద.. పిలుస్తున్న అస్పష్ట ఆకారం.. దగ్గరకు వెల్లితే మత్తేక్కించే చౌకరకం సెంటు గుబాలింపు.. చుట్టూ పరకిస్తూనే రావాలా అంటూ ప్రశ్న.. కొంచెం లేటయిందో.. త్వరగా తేల్చుకో.. ఇంకో బేరం ఉందంటూ గదమాయింపులు.. ........................................... ఆ చూపులో కోరిక లేదు.. దోరికి పోతామన్న భయం లేదూ.. కొత్త అనుభవాలను ఓడిసి పట్టుకోవాలన్నా అత్రుత లేదు.. నన్ను నమ్ముకున్నోళ్ల కడుపు నింపాలన్న తపనే కనిపిస్తుంది.. ఆ చూపుల్లో.. ఆకలే కనిపిస్తుంది ఆ చూపుల్లో.. .................................................. ప్రేమించిన వాడు మోసం చెసి కోందరూ.. మొగుడు వదిలేసిన వారు మరికొందరూ.. నా అనే వాడు పట్టించుకోక ఇలా ఎందరో.. అప్పులు తాళలేక.. బిడ్డలను పస్తులుంచలేక.. తన శరీరాన్నే వ్యాపార పాన్పుగా మారుస్తుందా పడతీ.. ............................................................ ఆమేను కదిలిస్తే ఎన్నో కధలు... మరెన్నో వ్యధలు.. రాత్రంతా జడలో నలిగిన మల్లుపువ్వులా వాడిపోయింది అంధం.. తన శరీరాన్ని కాక మనస్సున్న మనిషిగా గుర్తించమని పోరాడుతుంది ఆమే ఆయువు.. నడుస్తున్న కాలానికి బ్రతుకుతున్న జీవితానికి ఏర్పడిన కాళీని పూర్తిస్తుంది అమే.. శూన్యమైన మనస్పాక్షీతో....... కాలం రోగాల సర్పాలై ఆమే అయుషున్ని మింగేసింది.. కవ్వీంచే ఆ శరీరం ఇప్పుడు ఎముకల గూడైంది.. చీకటి పరదాలలో కూరుకుపోయిన హృదయాన్ని క్షమించి ఇంకా ఎంతకాలం వెలుగు నటించగలని ప్రశ్నిస్తుంది ఆమే.. నిజమే... ఆమే కౌగిలి పాన్పు తప్ప మనస్సుకు అంటుకున్న గాయాల వాసన ఎవ్వరికి పడుతుంది చెప్పూ... క్రొవ్వోత్తీ వేలుగే కాని .. ఆరిపోయిన కొవ్వోతి పోగ రింగులుగా అనంత వాయువుల్లో కలిసే అయువు ఎవ్వరికి కావాలీ..
by Vijay Gajam
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pxiare
Posted by Katta
by Vijay Gajam
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pxiare
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి