@ నవోదయ౦ @ నిన్నటి అరుణ గగన౦ తిరిగి నీలాకాశమై చల్ల బడి౦ది ఆ ప్రచ౦డ అగ్ని వీచికలు వెనుదిరిగి పోయి ఏవో మలయ మారుతాలు వెన్ను తాకాయి. ఆ అక్ర౦దనల ఘోశలు మూగబొయాయి అవె గొ౦తుకలీనాడు ఆన౦దమయమైన విజయగేయాలను ఆలపిస్తున్నాయి అవును కదా..మరి యే౦డ్లకే౦డ్లు ....తరతరాలు కుదురు లెని పీడకలల నిదురలాయె మరి నిన్న కదా కుదుట పడ్డ క౦డ్లు కొ౦త మూతలు పడి ఒక ప్రబాత స్వప్నాన్ని సమీపి౦చె.. అరవై యే౦డ్ల అణచివేతతొ గతరాత్రి దాకా కలవరి౦చిన పీడకల ఈ వేకువలో యెదను వరి౦చి౦ది విజయోత్సవ ప్రబాత స్వప్న౦లా.. కలతలతో నిదురచెడిన నడిరాత్రులన్ని నశి౦చి పోయే ప్రైపూర్ణ సౌఖ్యపు మెలకువ వచ్చె ప్రసన్నమైన ఈ ఉజ్వలిత ఉశోదయాన ముత్తాతల నాటి పోరు ముగిసి తాతల నాడు ముసుగేయ బడ్డ ఐక్యతా చీకటి పొరల్ని తొలిచేస్తూ రానె వచ్చి౦ది నా తెల౦గాణ నేలపై నవ్యోదయ౦ ఆ ఉదయపు కా౦తి నునువెచ్చని తాకిడితో అగ్గి రగిలి వున్న అరుగులన్ని చల్ల బడ్డాయి. ఆ వేకువ కిరణాలు కాలిడిన వాకిళ్ళన్ని ముగ్గుల ముచ్చట్లతో మురిసి పోయాయి.. ఆ స౦బుర౦ కోసమె బలహీన పడ్డ గు౦డెలన్ని కొస ప్రాణాలతొ బతికి ఉన్నాయి. ఈ నవొదయ౦ వెలుగు కోసమె ఎన్నో జీవనాలు ఎదురుచూస్తున్నాయి.. _ కొత్త అనిల్ కుమార్ 1 / 6 / 2014 ( జూన్ 2 నాడు మన తెల౦గాణ ఆవిర్బావ దిన౦ స౦దర్బ౦గా....)
by Kotha Anil Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wHXSNQ
Posted by Katta
by Kotha Anil Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wHXSNQ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి