పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, జూన్ 2014, ఆదివారం

సత్యం జి సామాన్యుడు కాదు కవిత

నీకోసం కవిత రాద్దాం అనుకుంటా.. చేయి కీబోర్డు మీటదాకా వెళ్ళగానే నువ్వు తప్ప ఇంకేమీ గుర్తురాదు మెదడుకి.. నా వేళ్ళు కీబోర్డు నుంచి నావైపు తిరిగి తిడుతూ ఉంటాయ్ ఇంకెంతసేపురా ఆలోచిస్తావ్.. త్వరగా ఏదో ఒకటి చెప్పు టైపు చేస్తా అని..! కానీ ఎన్నిటైపుల్లో ఆలోచించినా ఒక్కక్షరం కూడా బయటకు రామంటూ తలుపులేసుకుంటున్నాయి.. కానీ అప్పుడే నీ జ్ఞాపకాలు అక్షరాలు రాకపోతేనేం, నీకు మేమున్నాం అంటూ అదాటున అల్లేశాయి.. నువ్వు చెప్పిన మాటలన్నిటినీ కట్టిన మూటలు ఎన్ని ఉన్నాయో అవన్నీ వొంపుకున్నా.. చాలా పెద్ద కుప్పే అయ్యింది.. ఇంతలో నీకోసం నేను కన్న కలలన్నిటినీ బధ్రంగా దాచిన దారి కనపడే సరికి వాటిని వెతికి తీసుకొచ్చి కుప్పగా పోయటానికి ఎన్ని తిప్పలు పడ్డానో.. ఇలా నీ ఊహలు, నీ చేష్టలు, నీ అల్లర్లు, నాతో పంచుకున్న అనుభవాలూ అన్నిటినీ తెచ్చి కుప్పలుగా పోశా సరిపోలా ఆ స్థలం.. ఐనా సరే పోస్తూనే ఉన్నా.. ఆఖరుకి చూస్తే, నేను శూన్యంలో ఉన్నా, ఆ కుప్పల తెప్పలకి భూమి సరిపోలా.. సౌరకుటుంబం సరిపోలా.. విశ్వం కూడా నిండిపోతుంటే, ఒక్కసారిగా ఆ బ్రహ్మ వొచ్చి బతిమాలాడు, నువ్విలా విశ్వాన్నంతా నింపేస్తే నేను పుట్టించే జీవాలకి చోటు లేదంటూ.. అయీనా వినలేదు.. వినలేను.. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు విశ్వంలో ప్రతీ అణువులోనూ నువ్వూ నీ ప్రేమ తప్ప ఇంకేమీ లేదు మరీ..! ఇట్లు నీ నేను సత్యం జి, 01-06-2014, 22:15

by సత్యం జి సామాన్యుడు కాదు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n0zxxk

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి