కవిత : నా తొలి కవితా సంకలనం 'ఓనమాలు' నుండి : ఉదయిస్తున్న తెలంగాణను ఊహించుకుంటూ కోడై కూస్తున్నది పల్లె ఎగిలివారు మొగులు మీద ఏగుసుక్క పొడిసిందని ఇగం పట్టిన ఛాతీ మీద ఎగిరెగిరే సంబురాల సప్పట్లు పొద్దుపొడుపు తోవల్లో ఉరుకుతున్నవి ఊర్లు దుంకుతున్న జన సంద్రం పల్లెటూళ్ల పసిహృదయం వాడీ వేడీ తగ్గని ఎదిరిసూపుల నిట్టూర్పులు యాభై ఏళ్ల యాతనలు చినిగి రాలుతున్న చీకటి పరదాలు పొరలు విడిపోతున్న పొగమంచు తెరలు పసుపూ పారాణీ పూస్తూ ఎర్రచందనం బొట్లు పెడుతూ మంగలారతి పడుతున్నారు మా ఆడోళ్ళు కొత్తముత్తయిదకు ఇల్లు సగబెట్టుకునే ఇగురం నేర్పు తున్నారు నేను కష్టపడే కాపుని జనాన్ని సాదే సేను కాపుని దేశం కాసిన పాత కాపుని ఇగపొతా నాగాల్ని భుజానేసుకొని నెత్తిమీద కొత్త బరువు లెత్తుకొని కొత్తకోండ్ర పిలుస్తున్నది పండిస్తా పాటిపడ్డ పొలాన్ని. ఎంత సల్లగుందీ తూర్పు కొత్త గాలి ! -----(వీర తెలంగాణ -ఎప్రిల్ 2011 ప్రచురణ) Dt:01-05-2014
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1u3KVeX
Posted by Katta
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1u3KVeX
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి