పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, జూన్ 2014, ఆదివారం

Boorla Venkateshwarlu కవిత

*రాండ్రి రాండ్రి* రాండ్రి రాండ్రి తెలంగాణ తల్లిని రథంల ఎక్కిచ్చి ఊరంతా జులూస్ దీద్దాం రాండ్రి అమరుల పోటువలు నెత్తిమీద వెట్టుకోని వీరులారా వందనం అని వాడవాడనా తిరుగుదాం రాండ్రి మనుసు నిండా తంగెడు పువ్వుల పేర్చి గుండె నిండా గునుకపూల గజ్జెల గట్టి జయ జయహే తెలంగాణ అని ఇంటింటా పాడుదాం రాండ్రి మనిషి మీద మనిషి మనిషి మీద మనిషి మొగులు ముట్టేదాక నిలవడి కాళోజీ జయశంకర్ లకు జేజేలు గొడుదాం రాండ్రి ఆ బక్క పలుచటి ఉక్కు మనిషిని ఈ కొండంత కోదండ రాముణ్ణి బుజాల మీదికెత్తుకొని ఎగిరెగిరి దునుకుదాం రాండ్రి సోనియమ్మకు సుష్మక్కకు ఆడిబిడ్డ కట్నాలు వెట్టి విజయ హారతులిద్దాం రాండ్రి నాలుగు తరాల ప్రజల నాలుక్కోట్ల కల నవనవలాడే తెలంగాణకు న్యాయం జేస్తమని నాయకులతో బాస జేయిద్దాం రాండ్రి రాండ్రి రాండ్రి నదులకు నక్షత్రాలకు పట్నాలకు ప్రాజెక్టులకు పుట్టిన బిడ్డలకు కట్టిన స్థూపాలకు అమరుల పేర్లు పెడుదాం రాండ్రి రాండ్రి. 01.06.2014

by Boorla Venkateshwarlu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nF1Ncx

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి