పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, జూన్ 2014, ఆదివారం

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు *************** అపసవ్యం **************** ఓ వక్త మానవ మేథస్సును, మానవుని శక్తి సామర్థ్యాలను, మానవత్వాన్ని గురించి అనర్గళంగా ఉపన్యసిస్తున్నాడు. ఓ గంగిగోవు తనకు గడ్డినిచ్చిన యజమానికి పాలనిస్తోంది కృతజ్ఞతా పూర్వకంగా. ఓ గుళ్ళోమి దైవం తనముందే జరుగుతున్న దొంగతనాన్ని నిస్సహాయంగా గమనిస్తున్నాడు. దొంగలరాకను తెలిపేప్రయత్నంలో ఓశునకం నిర్విరామంగా అరుస్తోంది తమ బంధువు ఉసురు తీసిన కల్తీ ఔషధాలను ఓ నిర్భాగ్యుడు శాపనార్థాలు పెడుతున్నాడు. ఓ కాకి మరణిస్తే తల్లడిల్లిన సహచరకాకులు పరిసరాల్లో నానా భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఓ సైకిల్ ను నుజ్జు నుజ్జు చేసిన ఓ లారీ ఎవరికీదొరక్కుండా శరవేగంతో దూసుకెళ్తోంది ఓ తల్లి శునకం పిల్లిపిల్లకు ఆప్యాయంగా తనపాలనిస్తోంది. పిల్లలనిరాదరణకు గురైన ఓ మాతృమూర్తి వీథుల్లో బిచ్చమెత్తుకుంటుంది. డబ్బులివ్వలేని పేదరోగిని ఆసుపత్రి సిబ్బంది దగ్గర్లోని చెట్టుకిందికి ఈడ్చేస్తున్నారు నిర్ధాక్షిణ్యంగా. ఎవరెస్టు శిఖరంపై పతాకాన్ని ఎగురవేసిన ఓ పర్వతారోహకుడు క్రమక్రమంగా దిగుతున్నాడు. ఉత్సాహంగా నిప్పురవ్వలు చిమ్ముతూ నింగికెగసిన ఓ తారాజువ్వ మరుక్షణం నిస్తజంగా ముఖంమాడ్చుకొని సిగ్గుతో నేలపై దుమ్ములో తనముఖాన్ని దాచుకుంది. సరికొత్త మానవవిధ్వంస బాంబుతయారీలో విజయం పొందిన శాస్త్రవేత్తలు గంతులు వేస్తున్నారు. ఒంటరి యువతిని తుంటరులుకొందరు నట్టనడివీథిలో వేధిస్తూ ఆనందిస్తున్నారు క్రమక్రమంగా స్పృహను కోల్పోతున్నప్పటికీ ఓ వరాహం తన గుడిప్రదక్షిణను మాత్రం మానడం లేదు. శిలామయ విగ్రహపు కనుకొలకులనుండి అభిశంసనా పూర్వక వేదనాభాష్పాలో అభినందనా పూర్వక ఆనందభాష్పలో తెలియని కన్నీటిబిందువులు మాత్రం జాలువారుతున్నాయి. **** ********* 10 ఫిబ్రవరి 2013నాటి నమస్తేతెలంగాణ బతుకమ్మలో వచ్చిన కవిత చిరుసవరణలతో...

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rwmRDx

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి