పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, జూన్ 2014, ఆదివారం

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు 35 . ఇంతకుముందే మనవి చేశాను, మన మలయాళీ కవిమిత్రులు శిల్పంలోనూ, భావప్రకటనలోనూ వైవిధ్యాన్ని చూపిస్తూ చాలా గొప్ప కవిత్వం సృష్టిస్తున్నారని. ఈ కవిత అందుకు మరో ఉదాహరణ. చదువు మనుషులకి సంస్కారం నేర్పనంతవరకు, జాతి, మత, వర్ణ, వయో వివక్షలేకుండా స్త్రీలు యువతులూ, బాలికలు అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. ఇది చాలా చిత్రమైన పరిస్థితి... వివేకమున్నవాడికి బోధన అక్కరలేదు; వివేకం లేనివాడికి ఏ బోధనా ప్రయోజనం లేదు. కవులు వాటికి తమవంతు స్పందిస్తూనే ఉన్నారు. కానీ, ఆవేశాలూ, శాపనార్థాలూ, ప్రాక్సీ అభిమానాలూ, లేదా సంవేదనలూ, బోధనలూ, కవిత్వం కాదు. ఒక అమానవీయ సంఘటన జరిగినపుడు కవులు ఎలా స్పందించాలో, దాన్ని ఎంత జాగ్రత్తగా, పదాల్లో చిత్రీకరించాలన్నదానికి, నా దృష్టిలో, ఈ కవిత ఉదాహరణగా నిలబడుతుంది. మనలోని ఆత్మవంచననీ, సంఘంలో ఎంత పకడ్బందీగా, వ్యవస్థీకృతంగా అన్యాయాలు జరుగుతున్నాయో, వాటికి ఎవరెవరు ఎలా కొమ్ముకాస్తున్నారో, వాళ్ళ పాత్రలేమిటో, వివరిస్తూ, అన్యాయాన్ని ఎత్తిచూపించడంలో జంకకపోవడమే కవిచెయ్యవలసిన పని. ఈ కవితలో Mannequins ని ప్రతీకగా తీసుకుని శిల్పం నిస్సందేహంగా కొత్తపుంతలు తొక్కింది. ఈ కవిత గొప్పదనం చివరి పంక్తుల్లోనే ఉంది. చాలా సందర్భాలలో సంఘటనలు సినిమాలలో చూపించినట్లు యాదృచ్ఛికాలు కావు. కాని, యాదృచ్ఛికాలుగా చూపించే కల్పన ఉంటుంది. ఆ కల్పనలోని చాకచక్యమే సందేహాలకు తావు కల్పిస్తుంది. ఆ తావులోంచే న్యాయం నీరుగారిపోతుంది. ఇంత గొప్ప కవిత అందించినందుకు శ్రీ విష్ణుప్రసాద్ గారిని హృదయపూర్వకంగా అభినందించకుండా ఉండలేను. . చిత్రమైన సంఘటన. . దృశ్యం 1 లేదా మిలిండా కురియన్ అనే సేల్స్ గర్ల్ వస్త్ర దుకాణంలో ఎలా ఒంటరిగా మిగిలింది? లాఠీలుపట్టుకున్న ‘పోలీసులనే చెత్తబుట్ట’లోకి ఎవరు ఊరు ఊరంతటినీ ఒంపీసింది? లేదా అకస్మాత్తుగా దుకాణాలు మూసెయ్యమని ఆజ్ఞాపించింది? ఇక్కడ ఊరంతా ఎలా నిర్మానుష్యం ఐందన్నది ప్రాథమికం మేధావులు ఎప్పటినుండో అంటూనే ఉన్నారు ఇక్కడ ప్రతీదీ కుట్రే అని. ఏది ఎమైనా, ఎలా జరిగినా మిలిండా కురియన్ మాత్రం Merriment Textiles లో అకస్మాత్తుగా ఒంటరిగా మిగిలిపోయింది. షో రూం యజమాని షఫీక్, షాపు తాళాలు ఆ అమ్మాయి చేతికి ఇచ్చి షట్టరు దించి బైకుమీద వెళ్ళిపోయాడు. ఆమె కొత్తగా వచ్చిన దుస్తులను అక్కడున్న మూడు మగబొమ్మలు లియో, డియో, రియో లకు తొడుగుతోంది. అకస్మాత్తుగా అందులోని లియో అన్న బొమ్మకి ప్రాణం వచ్చి ఆమె భుజాలమీద చేతులు వేశాడు. ఆమె ఆశ్చర్యపోయి అందులోంచి తేరుకునేలోగా ఆమెని ఎత్తుకుని స్టోర్ లోకి వెళ్ళేడు మిగతా రెండుబొమ్మలకీ ప్రాణం వచ్చి అతన్ని అనుసరించేరు. ఆమె సహాయంకోసం కేకలువేస్తుంటే ఆమెగొంతులో గుడ్దలు కుక్కి… ఆమెని దుకాణంలోని బట్టలమీద పడేసి... ఒకరి తర్వాత ఒకరు... అవి నిజమైన బొమ్మలే, అయితేనేం, అవి అచ్చమైన మగ మృగాల్లాగే ప్రవర్తించేయి. దృశ్యం 2 ఒక గంట గడుస్తుంది. నగరానికి మళ్ళీ ఊపిరివస్తుంది. యజమాని షఫీక్ షాపుకి తిరిగి వస్తాడు (దుకాణాలు మూసే నిరసనై ఉండదు. అయితే గంటసేపే ఎందుకుంటుంది? బహుశా సంఘవ్యతిరేకశక్తులపై పోలీసులు విరుచుకుపడడమై ఉండొచ్చు) మళ్ళీ షట్టర్లు పైకి లేస్తాయి. Merriment Textiles వస్త్రదుకాణంలో ఇప్పుడు, కొత్తచీర చుట్టబడి మిలిండ అనే ఆడబొమ్మ ప్రదర్శన పెట్టెలో నిలుచుంటుంది. ఇప్పుడది యదార్థమైన బొమ్మే ఫైబరుతొనో దేంతోనో చేసుంటారు దాన్ని. షోరూం జనాలతో కిటకిటలాడి పోతుంది. లియో, డియో, రియో ముగ్గురూ ఖాతాదారులకి సేవలందించే సేల్స్ బాయ్స్. వాళ్ళు ప్రదర్శన బొమ్మలు కానే కారు. అన్నిరకాల నమూనాలలోని వస్త్రాలనీ చక్కగా అందంగా నవ్వుతూ చూపిస్తూనే ఉంటారు. వాళ్ళు యదార్థమైన మనుషులు. ప్రమాణపత్రం ప్రత్యక్షసాక్షిగా ఇదే నా ప్రమాణం. మొదటి సందర్భంలో మిలిండా కురియన్ ని సేల్స్ గర్ల్ గా చూసేను. ఆమె యదార్థమైన స్త్రీయే. కానీ, ఆమెని మానభంగం చేసింది మాత్రం రియో, డియో, లియో అనే ప్రదర్శన బొమ్మలు. అవి కేవలం బొమ్మలైనప్పటికీ చిత్రాతి చిత్రంగా, ఎక్కడనించి వచ్చిందోగాని, వాటిలో చేతన మాత్రం వచ్చింది. ఇప్పటికీ ఆ శరీరాల్లో అమానవీయ ప్రకృతి మిగిలే ఉంది. రెండో సందర్భంలో మిలిండా అచ్చమైన ప్రదర్శన బొమ్మ ఆమె నిజమైన స్త్రీ అనడానికి ఆస్కారాలు ఏమీ కనిపించడం లేదు. ఉదాహరణకి, షాపు యజమాని షఫీక్ నామమాత్రంగా కూడా స్పందించలేదు. ఖాతాదారులు కూడ చెప్పరాని నేరమేదో జరిగినట్టు అనుమానిస్తున్న సూచనలుకూడా ఏవీ లేవు. లియో, డియో, రియో ముగ్గురూ అన్ని రకాలుగానూ మగపురుగులే. వాళ్ళు ప్రదర్శన బొమ్మలుగాని, వాళ్ల శరీరాలు అసహజమైనవిగాని కావు. రచయితగా నేను చేసిందేమిటంటే రెండు సందర్భాలలో తలెత్తిన రెండు రకాల అవగాహనలనీ సమ్మిళితం చెయ్యడానికి ప్రయత్నించేను. ఇందులో మీకు ఏమైనా అనుమానాలు తలెత్తితే ఇప్పటికి నేను చెప్పగలిగింది ఇంతే: ఇందులోని యదార్థం ఆ రెకెత్తే అనుమానాలే అని. . విష్ణుప్రసాద్ మలయాళీ కవి. . Narration of an obscure and mysterious incident Spectacle One Or, How did Melinda Kurian, the sales girl, find herself alone in the showroom? Who emptied out the city into the trash can of a baton wielding police assault or a suddenly descending `shutters down’ call? It was crucial that the city be vacant. Learned people have said this for long That everything is a conspiracy. Whatsoever, howsoever, Melinda Kurian was alone in Merriment Textiles. The showroom owner Shafeeq gave the keys to the girl, rolled down the shutter and sped off on his bike. She was putting clothes from a new type of fabric on three male mannequins named Leo, Deo and Rio. All of a sudden, the male mannequin named Leo laid his hands on her shoulder. Soon as she looked up shell shocked, he lifted her and carried her to the store. The other two mannequins followed them. When she cried for help, the mannequin gagged her mouth. She was laid on top of the clothes in the store. Then, the mannequins took turns…. They were real mannequins. Yet, they carried out their duty as males. Spectacle Two An hour passed. The city came alive. The showroom owner Shafeeq returned. (Can’t be `shutters-down strike’ for just an hour. Must have been a crackdown by the police.) The shutter was rolled up. Now, draped in a new sari, Melinda, the mannequin, stands in the display booth of Merriment Textiles. She is a real mannequin made of fiber or some such stuff. The showroom is packed. Leo, Deo and Rio are the three sales boys attending to the customers. They are not mannequins at all. They keep displaying clothes in many design patterns with beatific smiles. They are three real men. Affidavit This, my affidavit as an eyewitness. In the first situation, it was as a sales girl that I saw Melinda Kurian. She was a real woman. But, she is raped by three mannequins named Rio, Deo and Leo. Though mere mannequins, they did gain mobility, most amazingly, out of the blue. But, they still retained their plastic bodies. In the second situation, Melinda is a true mannequin. There is no evidence in the second situation to demonstrate that Melinda had been a woman. For example, the shop owner Shafeeq is not even mildly surprised. The customers too don’t show any sign that anything untoward had taken place. Leo, Deo and Rio, all the three, are men in every way. They are not mannequins or plastic-bodied. What I did as a writer was to cobble together these two perceptions that cropped up in two situations. If this created any puzzlement, I can only say for now that this uncertainty is the reality. . Malayalam Original: Vishnu Prasad English Translation by: Ra. Sh.

by Nauduri Murty



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wHXLSc

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి