నిశీధి | మీమాంస | సంబరమో , సమరమో కొత్త ఉదయాలు అన్ని ఒక్క పొద్దులోనే పాతబడిపోతాయి అన్న బెంగ కొత్త చీకటి ని వెలుగు రవ్వల ఆసరా తో ఆసక్తి గా గమనిస్తూ వందల బాధలకి ఒకే మలాం గాయాన్ని రాక్షస పుండు చేస్తుందేమో అనే కలవరం కలలన్ని వరాలే పొలాలన్నీ వరదలే పోల "వరం " లో పోగొట్టుకున్న ఆత్మలే నయా సునామీలై గడ్డి పరకల్లో మళ్ళీ వెతుక్కోవాల్సిన జీవితం కోసం టన్నుల్లో అందుతున్న భయం తరమ బడి . తరిమి కొట్టి పారిపోతూ ఆగిపోతూ ఎదురు తిరిగిన నిజాలు భవిష్యత్తులో కూడా కాంతిలేమి లో ఇంకిపోతూ భ్రమల వెలుగులు మబ్బులై తేలిపోతూ సంబరాలు గర్వానికి గర్వభంగానికి మధ్య నిలబడ్డ ego లో అర్ధం కాని రాజకీయ గెలుపోటముల అట లో ప్రాణం లేని సైనికుల కవాతు నగ్నంగా విసురుతున్న పేలవమైన నవ్వుల్లో వినిపిస్తున్న సమరాలు సంబరమో ? సమరమో ? నిశీ !! 1-05-14
by బ్రెయిన్ డెడ్
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iHPlRq
Posted by Katta
by బ్రెయిన్ డెడ్
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iHPlRq
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి