పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, జూన్ 2014, ఆదివారం

Thilak Bommaraju కవిత

తిలక్/కడలి చుక్క ................................ రెండోసారి జీవితం మొదలయినట్టుంది ఈరోజు బాల్యాన్ని వదిలేసాక మళ్ళీ పాత మట్టిలో నడిచి వచ్చాక నాలో కొన్ని జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి పుట్టుక మడుగులో పెరిగిన మహావృక్షంలా నేను కొన్నేళ్ళ తరువాత గతాన్ని కాలుస్తూ ప్రస్తుతానికి గుమ్మాలు కడుతూ సత్తు శరీరం మీద కుట్టుకున్న కొత్త చర్మం తిరిగి చిరుగులంటుతోంది నన్ను నేను మర్చిపోయాక అర్థం కాని అక్షరంలా బయట ప్రపంచానికి చూపెడుతూ ఇంకోసారి దిద్దుకున్న సముద్రపు చినుకులా వెన్నెలను కక్కుతున్న ఆకాశం అడవిని పదే పదే తడుపుతూ ఖాళీపాత్రలో నిండిన శూన్యాన్ని వడగొడుతున్న ఆకలి చేతులు నావి కొండచరియల నవ్వులు ఇన్ని వెతుకుతూ చరమాంకంలో సంపాదించిన గణాంకాలకు సూత్రాలను సాదిస్తూ సంకలనం ఇప్పుడు బాల్యానికి ఆనకట్ట తిలక్ బొమ్మరాజు 24.05.14 01.06.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kerjmo

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి