శ్రీ మోదుగు //భారతీయులందరూ నా సహోదరులు …// అప్పుడు లోపల ఉన్న సరిహద్దులు ఇప్పుడు బయట పెట్టారంతే ఆనందం బాధ ఏదీ లేదు నీకైనా నాకైనా కావలసిందే ముంది పేదోళ్ళకి పట్టెడన్నం పిల్లలకి కొంచం చదువు మరి కాసిని కొలువులు పెద్దోళ్ళకి ఇంత నీడ భూమికి కాస్త నీరు అద్భుతలేవో జరుగుతాయని ఆశలతో అకాంక్షించకు ఐనా వర్షాలు కురిశాయనో ఎండలు మండాయనో పిల్లలు ఏడ్చారనో కాకి అరిచిందనో మనం మనం అనుకునే మాటలేవి మిగిలి లేవు ఇప్పుడిక ప్రత్యకమంటూ ఏమీ లేదు అందరిలో నువ్వూ ఒకడివి ఇక ఈ పూట నన్ను నువ్వు నిన్ను నేను ఏదో విధంగా గౌరవించుకుందాం మరి భారతీయులందరూ నా సహోదరులు కదా Date:01/06/2014
by Sri Modugu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oijYR3
Posted by Katta
by Sri Modugu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oijYR3
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి