1
వంద యుద్ధాలను
నిర్విరామంగా చేసిన
వీర ఖడ్గం వొకటి
ఇవాళ
మ్యూజియం అద్దాల పేటికలో
గాఢo గా నిద్రపోతోంది !
2
రాజ ప్రాసాదం లో
మీసాలు పురితిప్పి
రొమ్ము విర్చుకొని రాజస దర్పం తో
విర్ర వీగుతూ నిల్చున్న నిలువెత్తు వర్ణ చిత్రం
ఇవాళ రంగు వెలసి
పొడి పొడిగా పెచ్చు లూడి దీనంగా
రాలిపడుతోంది !
3
ఎదురు లేని పోరాటం చేసి
రాజు పాదాల వద్దకు శరణు కోరే శిరస్సులను
తరుముకొచ్చిన
' ఫిరంగి 'యంత్రం
ఇవాళ గాంధీ పార్క్ లో
పిల్లలు గుర్రమాట
ఆడుకునే అట వస్తువు !
4
దళాల పద ఘట్టనలతో ప్రతిద్వ్హ్హనిoచిన
రాతి కోట గోడలన్నీ
శిథిలమై శిలలు ద్రవించి ఏడ్చుచుండగా
నేడు అక్కడే
గబ్బిలాల గుంపులు
రింగులు రింగులుగా గిరికీలు కొడ్తూ
కనువిందు చేస్తున్నాయి !
( ప్రజల 'నెత్తురు' తమకు 'అత్తరు' అని భావించిన వారి చరిత్ర ఇలాగే ముగుస్తుంది . ఇది చరిత్ర చెప్పిన సత్యం. )
*10-08-2012
charirtratmka santhyam...
రిప్లయితొలగించండి