పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, జూన్ 2014, మంగళవారం

Thilak Bommaraju కవిత

తిలక్/చరమాంకం రోడ్డును హత్తుకున్న నీరెండొకటి చీకటికి చుట్టమవుతూ మాయమవుతోంది వన్యపు స్తన్యాన్ని నరుకుతున్న చేతులు అప్పుడప్పుడు నీళ్ళొదులుతోంది కాటికి కట్టెలు కరువయ్యేదాకా రెండు కళ్ళలో ఇంత పచ్చదనాన్నీ పోసుకుంటావు చూడూ నువ్వు సంపాదించినట్టు తెల్లరక్తం ఆ పూలముఖాలపై ఎక్కువ కాలం వనాన్నీ తమలోకి తోడుకోలేక కొత్త వర్షం పలకరిద్దామన్నా పిలవలేని నిస్సహాయతలో ఓ సజీవ కళేభరం పరిది విస్తరించిందిగాని పరిమితిని కాపాడుకోలేక మట్టిగా మిగిలింది ఆనవాళ్ళను మిగుల్చుకోలేక ఆశలను వేర్లతుంగలో తొక్కి స్థాణువై నానుతూ తిలక్ బొమ్మరాజు 03.06.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n6IuFo

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి