పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, జూన్ 2014, మంగళవారం

John Hyde Kanumuri కవిత

హమ్మయ్య గడచింది రాత్రి |జాన్ హైడ్ కనుమూరి | *** సాయంకాలం అవ్వగానే వస్తూ పోతున్న విద్యుత్తు మేఘావృతమైన ఆకాశం వుక్కపోతకు చెమటపట్టిన దేహం హఠాత్తుగా ఉరుములు మెరుపులు కిటికీలను విరగ్గొట్టే హోరు గాలి కొద్దిగా చినుకులు గాలితో పాటు వస్తుంటే తలుపులు మూయాలనే పిలుపులు ఎక్కడో ట్రాన్స్‌ఫార్మర్ పేలిన చప్పుడు ఇక విద్ద్యుత్తు రాదని నిర్ణయించుకొని ఇటుదొర్లి అటుదొర్లితే కంటికి నిద్రేమీ సరిపోక మండుతుంటే ఇదిగో ఇప్పుడే పలకరించడానికి వచ్చింది విద్యుత్తు. రాత్రి మాటేమోగాని ఆఫీసులో చెయ్యాల్సిన పనులు చాలానే వున్నాయి. 3.6.2014.....08:22 hours ISD

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o4LRhd

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి