పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, జూన్ 2014, మంగళవారం

Kamal Lakshman కవిత

II కమల్II సగటు మనిషి ఆక్రోశంII --------------------------------------- కలలూ, కోరికలేమో గుర్రాలు శ్రమ , లక్ష్యాలేమో తాబేళ్లు అవకాశాలేమో తక్కువాయే పోటీలేమో ఎక్కువాయె రంగు రంగుల ప్రపంచం అడుగడుగునా కలుషితం గాడ్సేల కున్న విలువ గాంధీలకు లేదాయే తేలికగా విలాసమైన జీవితం అనుభావించాలనేదే అంతిమ లక్ష్యం చట్టాలేమో ఉన్నవాళ్ళ చుట్టాలు ఇచ్చుకోలేని వాళ్లకన్నీ కష్టాలు ఎన్ని అర్హతలున్నా వ్యర్థమే అయిన వాళ్ళు వెనక లేకపోతే అనర్హులు అందలమెక్కి అపహాస్యం చేస్తూ ఉంటే ప్రతిభా పాటవాలు వెలవెల బోయి విల విల లాడుతున్నాయి మూగబోయి వచ్చిన అవకాశాన్ని వదలక కష్టపడితే వచ్చేదేమో పిసరంతాయే ఏమని చెప్పేది, ఎన్నని చెప్పేది సగటు మనిషి పడే నిరంతర చిక్కుముళ్ళ మనో వ్యధ ప్రతి రోజూ పడుతూ లేస్తూ చస్తూ బ్రతుకుతూ... చెప్పలేక.. చెప్పుకోలేక మనసు చేస్తున్న గావుకేక... మనిషి పడుతున్న చావు కేక... కమల్ 3.06.2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h22gSZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి