ఏదో చెప్పాలనుకుని.... ----------------------------- అన్ని ఆకులను తాకుతూ వచ్చిన గాలి నన్నూ తాక్కుంటూ పోయింది నేనూ ఒక ఆకునై నృత్యం చేస్తూనే ఉన్నాను... ----------------------- సముద్రాన్ని చదివాను గుప్పెడు నీటిలో.... ----------------------- ఎన్ని చినుకులను కలిపినా చివరికి ఒక్క చినుకే మిగులుతోంది --------------------------- ఒక్కొక్క క్షణంలోనూ ఒక్కో ప్రపంచం --------------------------- ఒక్క మంచుబిందువునైనా సంపూర్ణంగా చూసింది లేదు ------------------------- నీడను తరిమితే సూర్యుడు దాక్కుంటున్నాడు ------------------------- అంతిమంగా ఏం చెప్పగలం మరణాన్ని తప్ప.... ------------------------- తమిళంలో నా మిత్రుడు మా పుహళేంది రాసారు.... ఆ భావాన్నే నాకు తోచిన తెలుగులో చెప్పాను - యామిజాల జగదీశ్ 3.6.2014 ---------------------------------
by Jagadish Yamijala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n6Isxt
Posted by Katta
by Jagadish Yamijala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n6Isxt
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి