Si Ra// చరిత్ర పుస్తకం // 3-6-2014 ఆ పుస్తకంలో నీకు అక్షరాలు మాత్రమే కనిపిస్తున్నాయెమొ నాకు రక్త కాలువలు కనిపిస్తున్నాయ్! ఆ పుస్తకంలో నీకు కాగితాలు మాత్రమే కనిపిస్తున్నాయెమొ నాకు జీవం ఉన్న అవయవాలు కనిపిస్తున్నాయ్! పేజీలు తిప్పుతుంతె, అర్థనాదాలు వినిపిస్తున్నయ్ ఎక్కడ చూసినా, యుద్దాలు, చీలుతున్న దేహాలు కేకలు, తెగిపడుతున్న చేతులు, చిద్రమౌతున్న నాగరికతలు ప్రతి అక్షరం లో రెండు కత్తులు రాజుకుంటున్న ధ్వని ప్రతి వాక్యం చివర, ఫిరంగి పేలిన శబ్ధం ప్రతి వ్యాసం తర్వాత, తలలు తెగిపడుతున్న చెప్పుడు. సరే అని కొంచం చుట్టు పక్కల చూస్తే యెగరేసిన జండాలు, కాలిపొతున్న దెహాలు దండయాత్రకి బయలుదెరుతున్న సైన్యాలు. గాలి పీల్చుకుంటే, గన్ పవ్డర్ వాసన ఒక సారి పుస్తకం అంతా అల తిప్పి చూస్తే తుపాకి కంటి తో స్వప్నించె విప్లవకారుడి పలకరింపు. భయం వెసి పుస్తకాన్ని దూరంగ విసిరేస్తే అది మాంసపు ముక్క అని ఒక డెగ దాన్ని ఎత్తుకెలిపొయింది.
by Si Ra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hvocGK
Posted by Katta
by Si Ra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hvocGK
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి