పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, జూన్ 2014, మంగళవారం

Pratapreddy Kasula కవిత

ఒక కవిత - కాసుల ప్రతాపరెడ్డి లోపలివీ, వెలుపలివీ మనసు పొరల్లోకి ఇంకుతయి చెట్టుకు పూసిన పుష్పం ఈ దేహం వాడకుండానే రాలిపడాలె ఆత్మ ఒడ్డున పడ్డ చేప పిల్ల ఈ శాపమెప్పటిదో, ఎవరిదో ఊపిరాడక తన్నుకుంటూ ఉంటది నిన్నటికీ నేటికీ ఎంతటి తేడా వాన చుక్కలు పెదవిని ముద్దాడుతుంటయి ఆరాటం, పోరాటం ఆశానిరాశల ఊగిసలాట పొత్తు కుదరని తండ్లాట, తల్లమల్లడం మనసు వేగాన్ని దేహం అందుకోదు ఈ నేలకు ఎందుకింత ప్రేమ ఆత్మనూ దేహాన్నీ మోస్తది కన్ను మూసుకున్నా పట్టని నిద్ర తొవ్వల మీద నెత్తురోడుతున్న పావురాలు మోదుగు చెట్టు ఒళ్లంతా పూలే ఎందుకొస్తామో, ఎందుకు పోతామో నేల తల్లి పచ్చి పుండు అయితనే వుంటది నీటి మీది రాతలో, నుదుటి రాతలో చెప్ప వొశం గాని వెతల కతలు రోదించే తోటలోకి పాట ఒక్కటీ రాదు

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iPrfUX

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి