పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, జూన్ 2014, మంగళవారం

Pardhasaradhi Vutukuru కవిత

!! నీదే స్వంత నిర్ణయం !! మనదొక వింత ప్రపంచం ఎవరికీ ఎవరు తెలియరు మాటలు తెలుస్తాయి అవి నిజాలో అబద్దలో తెలియదు వ్యక్తిగత జీవితాలు తెలియవు మనసులో భావాలు అనుకుంటాం ఎ భావం అయినా పలికించ గలరేమో కదా ఏదైనా రాతలే కదా ఎలాగైనా రాయచ్చు మనసు అంటే మనో ప్రపంచం ఒంటరి అంటే స్వప్న ప్రపంచం విషాదం అనునయన ప్రపంచం ఊరట ఓదార్పు ప్రపంచం తోచక పలకరిస్తే స్నేహ మయం ఎన్నో పరిచయాలు రకరకాల పలకరింతలు ప్రతి పిలుపు లక్ష్యం మనమే మన సమస్యల వలయం లో కొద్దిపాటి విశ్రాంతి కి ఇక్కడకు వస్తే తెలియని అర్ధం కాని కొత్త సమస్యలు తెలియకుండానే ఇరుక్కుపోయే సాలెగూడు ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న కుటుంబాలు వచ్చి ఒంటరి తనం తో ఉండే కొద్దిమంది కుడా ఆ కుటుంబాలకు దూరం అవుతున్నారు ఏమైపోతున్నాం మనం ?? ఎటు వెళ్ళిపోతున్నాం మనం ?? నీతో కలసి వున్న వాళ్ళ కన్నా అపరిచితులే మనకు మిన్నా ??? నువ్వు నీలా ఉన్నంత వరకు ఇబ్బంది లేదు .... నువ్వు అలా వుండటం ప్రకృతి నిర్ణయమేమో ... తెలుసుకో సమస్య లేనంత వరకు మంచిదే సమస్య వస్తే నిన్ను రక్షించే వాళ్ళే ఉండరు ప్రతి వారు సలహా ఇస్తారు నీ చేతులారా చేసుకున్నావు అనుభవించు అని జాగ్రత్త .. అంతా మనవాళ్ళే అంతా మంచి వాళ్ళే ..... నీ నిర్ణయాలు నీవి నీ బలహీనత కాకూడదు నీకు మానసిక వ్యదలాగా !!పార్ధ !!3/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2KzSQ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి