_వాదం_ అపవాదెరుగనిదేది !! అమ్మాయ్యలతో మొదలు అందరి వాదవాదం అసలాద్యంతమనటమే నాటకం!! ఇంద్రియించుకున్న దేహజగంలో అర్థమో పీడగా .. భావమో క్రీడగా అవయవాలాకలికి ప్రాణమో చీడగా మండలమే లేని మొండి ప్రత్యక్ష్యంలో తలనుండెన్ని వాదాలు దూకాయో గండికొట్టినట్టు మొండాల్లోకి !! చురుకు చచ్చి మెదళ్ళు ముండమోసాయని గుండెలదురుతుంటే కడుపులు పైకి కక్కుతున్నాయి ఆకలికో వాదాన్ని.. ఎన్నాకల్లో !! తీరాయాంటే లేదు కడుపుల కిందాకలితో అడుక్కోని బిచ్చగాళ్ళని కక్కుతూ గుణించుకునే ఆకల్లతో ధన్యవాదాన్ని అడుక్కోవడం !! ధన్యవాదిస్తే పెరుగుతుందే తప్ప ఏ వాదానికీ ఆకలి తీరదు వాగుడాగదు !!___________(3/6/14)
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oqWEke
Posted by Katta
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oqWEke
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి