పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, జూన్ 2014, మంగళవారం

Chand Usman కవిత

చాంద్ || నిద్ర || నువ్వు నిద్రించక చాలా కాలమయ్యింది కదూ ఒక శరీరం నీ మీద కప్పబడినప్పుడు అలిసిపోయిన రెప్పల వెనుక నువ్వెంత కాలం మెలుకువగా ఉంటావు ******* దోసిళ్ళతో వెలుగు పువ్వులను పట్టుకొని కొన్ని నవ్వులను బాల్యం నుండి పిండుకొని తెల్లని కడిగిన కళ్ళతో నువ్వు ప్రకాశిస్తూ ఏదో ఒక దుప్పటి క్రింద కాదు నువ్వు అపరిమితంగా ఆ చల్లని గాలిలా వ్యాపించి వెన్నలవై రాత్రి మీద నిద్రించు ******* గాలి తాకిడికే తేరి చూచే కన్నులు నిదురించేదేపుడు కలలు కనేదెపుడు విడుస్తున్న శ్వాసలో నీది కానిది వదులుతూ నీలో ఒక శూన్యాన్ని పాన్పుగా పరుచుకో * * * చివరిగా ఒక మాట మనసుకు నిదుర రాదు నువ్వే నేర్పాలి చాంద్ || 3.06.2014 || ( " వాకిలి " జూన్ 2014 పత్రికలో ప్రచురితమైన నా కవిత )

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2hp6h

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి