Si Ra// సర్రియల్ కవిత // 13-6-14 ఆ రోజు ఒక కవిత నన్ను రాసింది పగలు, నాలో నిద్రలేచి ఒల్లువిరుస్తూ ఆవులించింది. కల్ల-అద్దాలు, కల్లని వేసుకున్నాయ్. నన్ను, కిటికీ తెరిచింది, ఆకాశం, పక్షి కంటిలో రెక్కలు కొట్టింది. మెల్లగా వెలుతురుని పరుచుకుంటు, చుట్టూ ఉన్న ద్రుష్యాలు నన్ను చూస్తూ నిలిచిపొయ్యాయి. గోడ మీద తగిలించిన గడియారం నా కంటిని పదే పదే చూస్తోంది. కాఫీ నన్ను వూపుకుంటూ తాగింది. ఏదో చెప్పుడు చేస్తొంది అని చూస్తే ఖాలి రోడ్డుపై రాలిన ఆకులని ఊడుస్తూ గాలి. ఒక మూలనుండి మియావ్ అనే శబ్దం పిల్లి లా నిశబ్దంగా తొంగి చూసింది. తడిగా ఉంది ఆకాశం; రాత్రంతా భూమి, ఆకాశం పై వాన కురిపించింది. ఆ రోజు పాంటు నా కాల్లని, షర్టు నా నలిగిపోయిన శరీరాన్ని ధరించాయి. అద్దం నన్ను చూస్తూ తల దువ్వుకుంది. జోబీలో శూన్యం గలగల మంటూ మోగింది. నా నీడ కదిలినట్లు నేను కదులుతున్నానో నేను కదులుతున్నప్పుడు నా నీడ కదులుతొందో అని ఆలోచనలో పడిపొయిన నన్ను ఒక కవిత రాసింది.
by Si Ra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lelIHl
Posted by Katta
by Si Ra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lelIHl
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి