కృతజ్ఞున్ని... ఈ ప్రపంచానికి క్రీ.పూ. క్రీ.శ. అని కాల విభజన ఉన్నట్టు నా ప్రపంచానికి నువ్వు దూరం కాక ముందు దూరం అయిన తర్వాత అనే కాల విభజన ఉంది కలతలతో కన్నీళ్ళతో నీరాకకై వేచేవాన్ని ఆశలతో అడుగులేస్తూ నీకోసమే నడిచేవాన్ని వసంతాలు, వర్షాలు పడేవి నా మనుసులో పూబంతులు, పచ్చని పసరికలు కురిసేవి నా కన్నుల్లో అనురాగాల ఓనమాలు దిద్దా నీ చూపులో ఆప్యాయతల తొలి అడుగులు వేసా నీ చేరువలో కాలమంతా కవిత్వమయం దూరమంతా చిరునవ్వుల సౌధం ధనం పోని, దారిద్ర్యం రాని నాకు నువ్వునావనుకున్నా ప్రాణంపోని చావు రాని నీతో కలిసున్నాననుకున్నా ఆనందాల రాశులు పోసావు నా గుండెల్లో సంతోషాల నాటు వేసావు నా బతుకులో అంతలోనే ఏమయ్యింది నా మనుసుకి సమయం భారమెందుకయ్యింది నా వయసుకి నాలో నేనే నిన్ను తలిచాను నీకన్న మిన్నగా నిన్ను వలిచాను మేఘం పగిలినట్టు అనంతాల వేదన నింపుకున్ననేను ఒక్కసారిగా పగిలిపోయాను కన్నీరునై మంచు కరిగినట్టు యుగాల బాధను నిలుపుకున్న నేను కరిగిపోయాను నిరాశనై ఏమయ్యిందంటావా? నువ్వు నా నువ్వు నన్ను వదిలావు కదా! నన్ను వీడావు కదా! అవునులే నువ్వు నేను ప్రేమించుకుంటే వదిలినట్టు నువ్వు నన్ను వీడినట్టు నేను మాత్రమే ప్రేమిస్తే నీ తప్పెలా అవుతుంది నువ్వు అందుతావనే విరహంలో ఉన్నప్పుడు నేను అక్షరాన్ని నువ్వందకుండా చేజారినప్పుడు నేను అశ్రువుని ఆశ చచ్చింది కాని ప్రేమెందుకు చావడం లేదో? దూరం పెరిగింది కాని బాధెందుకు తరగడం లేదో? ఇంతగా చెరగని పేరుగా నిన్నెందుకు రాసుకున్నానో? ఇంతగా మరుపురాని వలపుగా నిన్నెందుకు మలుచుకున్నానో? గాలి రాగానే చెట్టు కదిలినట్టు నీ తలపుకి నా కన్నులు పూలు రాలుచుతున్నాయి మరిచిపోవాలి మరిచిపోవాలి అని అనుకుంటే దేవుడు మరిచిపోయే శక్తిస్తే ఎంతబాగుండు ఇప్పటివరకు నిన్నే మరిచిపోయే వాన్ని నీ జ్ఞాపకాగ్నులలో నా శాంతిని కాల్చుకునే వాన్ని కాదు కదా! నాతో నీ ప్రయాణం నీతో నా చలనం ఇంకెన్నినాళ్ళో చూద్దాం ఏది ఏమైన నీకు కృతజ్ఞున్ని చచ్చేంత బాధలో కూడా నవ్వడం నేర్పినందుకు ఎదుటివాళ్ళు ద్వేషించినా ప్రేమను పంచడం నేర్పినందుకు
by Garige Rajesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oVHndt
Posted by Katta
by Garige Rajesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oVHndt
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి