పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, జూన్ 2014, శుక్రవారం

Chandrasekhar Vemulapally కవిత

చంద్రశేఖర్ వేములపల్లి || సహజీవన సౌరభం || అదే గీతాన్ని ఏకగళం తో అదే శ్రావ్యతతో గానం చేసి సాధారణ చిరు ప్రక్రియల భాగస్వామ్యం లో సౌకర్యం, ఆత్మానందం పొందగలిగి నాదీ, నాకోసమే ఆమె జనియించిందని అనుకునే....లా ప్రేయసి ఎవరైనా తారసపడాలని .... సుప్రభాత వేళ తన తీపి నవ్వుల పరిమళంతో నా ఉదయాన్ని చైతన్యం ప్రకాశవంతం చేసి తన మృదువాక్కుల, సున్నిత నయనాల పలుకరింపులతో నన్ను అభినందించి మరింత చేరువై ఆత్మాలింగనము చేసుకునే ఒక సహచరి ఎవరైనా రెండు గోడల ఇరుకు ఆలోచనల మధ్య రెండు శరీరాల సంబాషణ లా కాక అమ్మలక్కలు, మంద మారుతాల గుసగుసలు కలిసి, కలిపిన ఇరు హృదయ సంగమం లా బాధలు కష్టాలు కన్నీళ్ళలో తోడై ఉండే మానసి లా నా ఒంటరి హృదయం మౌనం ని భగ్నం చేసి చేరువై మమైకమై ఏ సహృదయం అయినా తన సంగమం తో .... తీపి అభిరుచి, సౌకర్యం ఒద్దిక కూర్చి నా ఆత్మ స్పందనలు కన్నీళ్ళు కష్టం నిశ్శబ్దం కలిసి పంచుకునేందుకు సమ భాగస్వామై ఎవరైనా పైకి కనిపించని తొందరపాటు గాయాలు మచ్చలు అవలక్షణాలు .... నా ఆత్మ అంతరంగం ను తట్టి మరొక ఆత్మ లా చేరువై సహృద్భావం తో బిడియపడక, అసహ్యించుకోక, అవకాశం అదృష్టం లా జీవితాన్ని మార్చుకుని సంభరపడిపోయే తోడు ఆ తోడు, ఆ లక్షణాలు .... ఆమె లో కనిపించాయి. ఎంత అదృష్టం అనే భావన కలిగి ఆమె సాన్నిహిత్యం అనుభూతి, స్వర్గం అనిపించే ఈ సంభరాల స్వాగత తోరణాలు .... ఆమె కోసం ఎర్రతివాచీ పరచి నా కలల హర్మ్యం ముంగిట్లో నిలబడి ఎదురుచూస్తూ .... నేను 13JUN2014

by Chandrasekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ku42HA

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి