పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, జూన్ 2014, శుక్రవారం

Nvn Chary కవిత

పాపం పసివారు (హిమచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విద్యార్థులకు నివాళితో ) - డా.ఎన్.వి.ఎన్.చారి.వరంగల్ 9866610429 నది నాగరికతకు చిహ్నమన్నారు జీవనాధారమన్నారు ఓ నదీ నీవది మరిచావ్ బియాస్ ఇందర్ని కలాస్ చేసావ్ కాపాడేవాడే పాడె కట్టినట్లు ఇంజనీరింగ్ లోనే యువ ఇంజన్లు మాయమయ్యా య్ ఆశా కిరణాలు ఆరిపోయాయ్ వికసించే మొగ్గలు అంతలోనే వాడిపోయాయ్ జలప్రవాహ వేగానికి ఆగమయ్యాయ్ కన్నవారి కన్నులను గంగమ్మను చేసాయ్ అసమర్థ పాలనా వ్యవస్థకు బలయ్యాయ్ ఇసుక మాఫియాల దురాగతాల సాక్షిగా ఇరువది ఐదు ప్రాణాలు హారీ అన్నాయ్ జవాబు లేని ప్రశ్నలు మిగిల్చాయ్ ఓడింది వారు కాదు అస్తవ్యస్థ వ్యవస్థ

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lluI2a

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి