విజ్ఞప్తి తెలుగులో మంచి కవిత్వం వస్తున్నప్పటికీ, తెలుగు కవిత్వానికి గుర్తింపు రావడంలేదన్న అభిప్రాయంతో గత కొన్ని సంవత్సరాలుగా నా వ్యక్తిగత అభిరుచులకీ, అవగాహనా, భాషా పరిమితులకి లోబడి అనువాదాలు చేస్తూ వచ్చేను. ఇక్కడ ఉన్న మిత్రులవేకాక చాలా మంది ఇతర సమకాలీన కవుల కవితలూ అనువాదం చేశాను. తెలుగు మాతృక, ఆంగ్ల నువాదం కలిపి వేద్దామని సంకల్పించేను. ఆ పుస్తకంలో తమకవితలు వేసుకుందికి అభ్యంతరం లేదని కవిమిత్రులు అనుమతి ఇవ్వవలసి ఉంటుంది లేకపోతే కొన్ని సాంకేతిక కారణాలవల్ల అందులో చేర్చుకుందికి సాధ్యపడదు. వీలయినన్ని ఎక్కువకవితలతో పుస్తకం తీసుకువద్దామని అభిప్రాయం ఉన్నా, పుస్తకం విస్తృతినిబట్టి, దానికయే ఖర్చు దృష్టిలో ఉంచుకుని అనుమతి ఇచ్చినప్పటికీ అందరివీ అనువాదం చేసిన అన్నికవితలూ వెయ్యడానికి సాధ్యపడక పోవచ్చు. కానీ, "వైతాళికులు - ముద్దు కృష్ణ" ఆదర్శంగా తీసుకుని, ఒక కవి స్పృశించిన విభిన్న పార్శ్వాల కవితలు అందులో చేర్చడానికి ప్రయత్నిస్తాను. కనుక ఇక్కడ ఎవరి కవితలు అనువాదం చేశానో ఆ కవిమిత్రులందరూ, నాకు nsmurty4350@gmail.comకి నే తీసుకురాబోయే సంకలనంలో తమ కవిత(ల)ను చేర్చడానికి తమ ఆమోదాన్నీ, అంగీకారాన్నీ తెలుపుతూ ఈ మెయిలు పంపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
by Nauduri Murty
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ls9UGn
Posted by Katta
by Nauduri Murty
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ls9UGn
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి