విశ్వ మాలికలు. 1.రాజ్యం వీర బోజ్యమే ఒకప్పుడు.! వీరులెవరు లేరిప్పుడు ఉన్నదంతా క్రూరులే.!! 2.ముక్కలయిన నా హృదయ శకలాల్లో చూడు.! ప్రతీదాంట్లో నీజ్ఞాపకమింకా శిథిలమవకుండా పునర్నిర్మాణానికై తపిస్తూనేఉంది.!! 3.కోరికలు.! గణించగ సాధ్యం కాని పుట్టుకలు.!! 4.అసంపూర్ణమే నాజీవితం.....! నువ్వు తోడులేని ఏ జన్మైనా..!! 5.నీఊహలెంత తుంటరివి.! నామనసుని అల్లరిపెడుతూ తుళ్ళిపడేలా చేస్తున్నాయి.!! 6.వయ్యారి వెన్నెలమ్మకిది అలవాటే.! సూరిడొచ్చే వేళకి తను మాయమవుతూ విరహంతో మండించడం.!! 7.ఆకలేసిన నా మది... నెమరేస్తూ నీ జ్ఞాపకాలు.! 8.నింగి చేలో విరగకాసిన చుక్కల పంట.! పంటకోతకు కూలీలే దొరకట్లేదు రైతు చంద్రయ్యకి.!! 9.నాదేహం... రెండు ముక్కల కలయిక.! నువ్వో సగం... నేనో సగంగా.!! 10.యుగాలు క్షణాల్లా పరిగెడుతున్నాయి.! నీతో సాగే నాజీవితకాలంలో.! 12.పుట్టేందుకే.... తొమ్మిది నెలల కాలం.! పోయేందుకు ఊపిరాగితే చాలును క్షణకాలం.! 13.అఖండజ్యోతిలావెలిగిపోతూ కాలం.! క్షణాలు ఆజ్యంగా కరుగుతుంటే.!! 14.కాలం కొండ పైనుండి దొర్లే బండరాళ్ళు క్షణాలు.! ఉపయోగించుకుంటే ఆనందాలకు పునాదిరాళ్ళవుతాయి...ఆదమరిస్తే జీవితాన్ని కాలరాస్తాయి.!! 15.మది భావాలను మస్తిష్కంతో మదించా.! దొరికింది అక్షయపాత్ర నిండా కవితామృతం.!! 16.నాది రోజూ చుక్కల పక్కనే.! నా చక్కదనాల చుక్క పక్కనుంటే.! 17.అలగకే సఖి.! అలకలో నీఅందం రెట్టింపవుతుందన్నానని అస్తమానం అలిగితే ఎలా? 18.రెండిళ్ళపూజారి.... సూరీడు.! ఉదయం తూరుపింట్లో....సాయంత్రం పడమరింట్లో.!! 19.చెదిరిన నా మనసులో... చెరగనివి నీ జ్ఞాపకాలు.! 20.క్షణాలు లెక్కెట్టడం తేలికేంకాదు.! నువ్వు లేనపుడు అవి యుగాలుగా తోస్తాయి మరి.! 21.సంగమించిన మన మది నదులు.! ప్రేమ సంద్రంలో లీనమయ్యేందుకు ఉరకలెత్తుతూ.!! 22.దిష్టితీయాలినా కళ్ళకు.! నిన్ను రెప్పలమాటున దాచినా కూడా చూసేస్తున్నాయి కలలు.!! విశ్వనాథ్ 02APR14
by Viswanath Goud
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mzqkuO
Posted by Katta
by Viswanath Goud
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mzqkuO
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి