" ఒక స్వాప్నికుడి సంభాషణల్లో ఏమున్నాయో ఎలా చెప్పడం ? కాలంలో కరిగిపోతున్న మనిషిని పట్టుకోడానికి ఒక భావుకుడూ, విమర్శకుడూ కలిసి తీస్తున్న పరుగు నుంచి ఎన్ని పదచిత్రాలని ఒడిసి పట్టుకోగలం? కలల దారులు ...నిజాలు నమ్మకాలు.... అశలు అద్భుతాలు ....నిరసనలు ధిక్కారాలు ... ఈ రచనల టాగ్ వర్డ్స్. వాటి చుట్టూ కట్టిన ఈ సంభాషణా సౌధంలో కావలిసినన్ని కవిత్వ పాదాలు, గొంతు చించుకోగలిగినన్ని నినాదాలు , కంఠతా పెట్టగలిగినన్ని సుభాషితాలు, కళ్ళు చూడగలిగినన్ని కాంతి స్తంభాలు కనపడతాయి. అందుకే ఆగి ఆగి వెళ్ళండి.వీలై నన్ని మజిలీలు చేయండి . పైనున్న నగిషీలతో పాటు కాళ్ళ కింద నేలను కూడా చూస్తూ సాగండి. సన్నటి దారేదో కనిపిస్తుంది. కనిపించకపోతే కనిపించేదాకా వెతకండి.ఆది తప్పకుండా మిమ్మల్ని మనిషి దగ్గరికి తీసుకెళుతుంది. ఆదమరిచిన క్షణాలలో మీరు పోగొట్టుకున్న మీ లోపలి మనిషి దగ్గరికి తీసుకెళుతుంది. మనిషి అంతరంగానికి మించిన రణస్థలి ఏదీ లేదు ఇవాళ. అక్కడ నిలబడి ఇరుపక్షాలతోనూ మాట్లాడటమే సంభాషణకు కొత్త అర్థం.ఆ సాహసం చేసినందువల్లే ఈ అక్షరాలు,ఆలోచనల పట్ల మనకు ఇంత మోహం." పర్స్పెక్టివ్ (ఆర్.కె) ప్రచురణలో భాగంగా కె.శ్రీనివాస్ ( ఆంధ్రజ్యోతి సంపాదకులు) ఆంధ్రజ్యోతి లో ( 2004-2010) వరకు నిర్వహించిన' కాలమ్స్' లలో కొన్ని వ్యాసాలను కలిపి "సంభాషణ " గా (2011) లో తీసుకువచ్చిన పుస్తకం అట్ట వెనుక 'వేమన వసంతలక్ష్మి' రాసిన మాటలవి. " నూరు పూలు వికసించనీ .. వేయి ఆలోచనలు సంఘర్శించనీ " అన్న సిద్ధాంత విశ్వాసానికి నిబద్దతే ఈ గ్రంధాన్ని చదవడం. 2-4-2014.
by దాసరాజు రామారావు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAgpol
Posted by Katta
by దాసరాజు రామారావు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAgpol
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి