ఐదు 1. నేల నా పొలం నింగి నా తలరుమాలు గాలి నా చెమటల ఆవిరి ఎండ నా వెచ్చని వూపిరి నా కన్నీళ్ళు ఇంకని సముద్రం 2. వాడిపోని వసంతాలన్నీ నా పొలంలోనే మరిగిపోని రాత్రింబవళ్ళు నా కంటిలోనే ఊపిరులూదే ఆశల సేద్యగాణ్ణి రేపటి నక్షత్రాల సోపతిగాణ్ణి పచ్చటి నేల, పచ్చటి నీరు, పచ్చటి ఎండ పచ్చటి చందమామ, పచ్చటి ఆకాశం నేనొక పచ్చటి వెలుగురాగాల ఏక్ తారను మిన్ను మన్నునేకం చేసిన పాటను 3. కైగట్టని దుక్కంలేదు, కైగట్టని నవ్వూలేదు కైగట్టరాని దేముంది ఈ లోకంలో ఊకుంచడానికయినా, చెప్పరాని బాధలయినా పట్టరాని సంతోషమయినా, పట్టి దాచుకున్న పచ్చరెక్క ముచ్చట్లయినా కైగట్టరానిదేముంది 4. పులకరించిపోయే కలలకు ఈ దేహం పలవరించిపోయే వూహలకు ఈ మోహం నేను నాకే చాలని విశ్వాన్ని నేను నాకే చిక్కని రహదారిని 5. నా లెక్కనె నా కవిత్వం కూడా నా పక్కనె నా కవిత్వం నీడ
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAtAFR
Posted by Katta
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAtAFR
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి