పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఏప్రిల్ 2014, బుధవారం

Jwalitha Denchanala Jwalitha కవిత

జ్వలిత/ ఏదో జరుగబోతున్నది కొత్త ఆశలతో కొత్త కోర్కెలతో నవ వసంతమవతరించింది త్యాగాల ఆత్మబలిదానాల సకల ప్రజా ఉద్యమాల ఫలం అమౄత భాండ స్వర్ణపీఠమది గులాబీపూలు గోదావరీ ప్రవాహమై పొంగుతూన్నాయి కమలం కుల పర్వతమై(స)మతంగా ఎదుగుతూన్నది అదృశ్య హస్తమొకటి అంచెలంచెలుగా రంగులు మారుస్తూన్నది భుజాలు చేతులు కాళ్ళు ఒకసారి కనిపిస్తే పెదవులు కళ్ళు తొడలు మరోసారి కనిపిస్తూన్నాయి శిరస్సు లేదు శిస్నం లేదు అసలు దేహమే శూన్యం శతాబ్దాలు శతాబ్దాలుగా నిత్యం నేను మరణిస్తూనే ఉన్నాను నాలికలు చాపిన సకల అధికార దాహం చంపుతూనే ఉన్నది నన్ను కొత్త విద్య నేర్చిన శిష్యగణం మరణించిన మృతపుండరీకానికి ప్రాణమిచ్చి శక్తినిచ్చి కొత్త రూపానిచ్చి అలంకరణాభరణాలనిచ్చి ఒక స్వేచ్చా సౌందర్యాగ్ని కీల వెలిగించబడింది అభివృద్ది రాకాసి పైశాచిక శక్తి మృత్యు కుహరాలను తెరిచింది ప్రాణమిచ్చిన వాడిదా వాడిదా-వీడిదా-వాడిదా కర్ణభేరులను చేదిస్తూన్న వాటాల వాదం నేనెక్కడా శిధిల శకలమై కూడా మిగలలేదు విజయోత్సాహం వీరంగమేస్తూన్నది రాజ్యం ఒక రాజకీయ రంగస్థలం ఒకే నటుడు దశావతారాలనెత్తి ప్రజావాహినిని ఉర్రూతలూగిస్తూంటే గొర్రెలన్నీ కాయితాలను తిని సిరాతో నాలుక తడుపుకుంటున్నాయి మేక వన్నె మెఖాలు 'మెకాలే'సిధ్ధాంతాన్ని కప్పుకున్నాయి చీరలన్నీ మాయమై చైతన్యాన్ని చుట్టుకున్నాయి ఇక్కడ సామూహిక లక్కాగృహాల దహనం జరుగుతూన్నది ఇప్పుడు మర్మ మార్గాలు చూపే"విదురులు" అలభ్యం సంజీవనీ వనాలు మాయారణ్యాలయి మారణ హోమాల సాక్ష్యాలను కోల్పోతున్నాయి నీళ్ళు నిధులు ఊళ్ళు ఉద్యోగాలు పదవులు పొట్లాలు పొట్లాలుగా-పెట్టెలు పెట్టెలుగా కట్టలు కట్టలుగా-సీసాలు సీసాలుగా కంచెలు దాటి మందల మధ్య నుండి ప్రవహిస్తూన్నాయి మళ్ళీ నేను ఒక మాంసపు ముద్దనై ఉప్పూకారము అద్దబడి మాటలతో చేతలతో నగ్నీకరించబడ్డాను ఒక సమూహమై నిలిచి-కీర్తి లాలసనై అపకీర్తి కళంకితనై శూన్య మహార్ణవమయినాను ఒక పసివాడు చిరిగిన లాగును పైకి గుంజుకుంటూ మధ్యం పాకెట్టు నీళ్ళ పాకెట్టు పట్టుకొని తల్లి కొంగు చాటు నుండి తండ్రి కొరకు నడుస్తున్నాడు చరిత్ర టర్నింగ్ పాయింట్ లో రక్తమోడుతున్న స్త్రీ దేహం ఒక రుడాలి చేతిలో ఏదో జాగ్రత్తగా పట్టుకొని నడుస్తూన్నది నడక ఆగగానే ఏదో జరుగబోతున్నది అవును ఏదో జరుగబోతున్నది ------------- జ్వలిత 9989198943,02/04/2014,7.58పి.ఎం

by Jwalitha Denchanala Jwalitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pLf2Wg

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి