పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఏప్రిల్ 2014, బుధవారం

Usha Rani K కవిత

మరువం ఉష | వీక్షణ కాంక్ష ---------------------------- చుట్టుపక్కలకి చూపులు ప్రసరించటం ఇంకాస్త తీవ్రతరం కావాలి, కనుమరుగౌతున్నవన్నీ కళ్ళలోకి పట్టేయాలి. కబోదికి కళ్ళు వస్తే, దృగ్గోచర ప్రపంచ రూపురేఖల్లో ధీర్ఘకాల దుఃఖిత మమకారంతో లీనమయ్యే రీతి చెందాలి: కొత్త కళ్ళుంటే బాగుండునని ఉంది. కళ్ళ నుంచి కాంతి పుంజం నలుదిక్కులా పరావర్తనం చెంది ప్రకృతి దర్పణంలో భాసిల్లే ప్రతిరూపాలు పలుకరిస్తుంటాయి రాతిలో రంగులు గమనిస్తున్నాను ఏటిలో కెరటాలు పసిగడుతున్నాను వింత ఆకృతులూ ఊహిస్తుంటాను మరి, ఇంకా ఎందుకీ వీక్షణ కాంక్ష? స్మృతి పథంలో దృశ్యాలు మనసు ఆవరణకి తేవాలి విస్పష్టమైన రూపాలని మరొకసారి పరిశీలించాలి తిరస్కృతి లో చేజార్చుకున్న జ్ఞాపకాలు ఉన్నాయేమో తరిచి చూడాలి చూపుని ఏమార్చి లోలోపల చోటుచేసుకున్న గురుతులని పదిలం గా పొదిగి వెలికి తీయాలి నా కనులకి అలవోకడ అలవాటు కావాలి రాతి గుండెలో కదలిక కనిపెట్టాలి ఉదాసీనత పట్టి పీడిస్తున్న మనిషిని చుట్టుముట్టాలి 'సగటు', 'మామూలు' కొలతల్లో మునిగిన వారికి 'శూన్యం', 'సంపూర్ణం', 'నిశ్శేషం' ఉంటాయని చూపగలగాలి మూగ/వోతున్న/ జీవుల వేదన కంటిపాపకి అందాలి సాగిపోతున్న కాల చరిత్ర ని కనులారా చదవాలి లోపలా వెలుపలా నడిచే యోచనలకి సమన్వయం కుదర్చాలి... 01/04/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h0OtuZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి