పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఏప్రిల్ 2014, బుధవారం

Annavaram Devender కవిత

పున్నం పున్నం కు కవిత్వం ఎన్నీలై పరుచుకుంటంది అన్నవరం దేవేందర్ .....................................తొవ్వ...02.04.2014 అవును పున్నం పున్నం కు కవిత్వం ఎన్నీలై పరుచుకుంటంది .కరీంనగర్ లో ఇది గత ఎనిమిది నెలలలు గా సాగుతంది .ఒక్కో పున్నం నాడు ఒక కవి ఇంటి డాబా మీద కవులంతా సాయంత్రం ఏడింటికి జమ అయితరు.గుండ్రగా కూసోని మనిషో కవిత సదువుతరు .అటేనుక ఆ కవితలన్నీ మల్లవచ్చే పున్నం కు పుస్తకంగా వస్తయి.తెలంగాణా రచయితల వేదిక జిల్లా శాఖ దీన్ని ఏర్పాటు చేస్తే సాహితీ సోపతి అచ్చోస్తది. ఇది ఇప్పుడు మహా అద్బుతంగా నడుస్తంది .ఒక్కో పున్నం కు అరవై ,డెబ్బై మంది కవులు వస్తుండ్రు .ఇందులో యువ కవులు పది పదిహేను దాక ఉంటరు.ఇలా కొత్తగా రాస్తున్నవారు హాజరవడం పాత వాళ్లకు ఆనందం అయితంది . మల్లా కవిత్వం కూడా కొత్త పుంతలతో రాస్తండ్రు .ఇలా కరీంనగర్ లో కవిత్వ వాతావరణం వెళ్లి విరుస్తుంది ఒక్కో కవి ఇంటి డాబా మీద ఎన్నీల కవిత్వం నడుస్తుంటే అక్కడికే పులిహోర ,బజ్జీలు ,సమోసా ,గుడాలు ,గారెలు ఇలా ఎదో ఉపాహారం వస్తుంది .ఆ రాత్రి సాహిత్య అనుభూతి తో గడుస్తుంది .కవిత్వం చదివే ఇల్లు ఇంటి పక్కాలు సుట్టాలు ఈ సమ్మేళనం ల పాల్గోటండ్రు.ఆతిథ్యం ఇచ్చే కవి ఇంటికి జిల్లాలోని కవులంతా కలిసి రావడం గొప్పగానే ఉంటంది .అపార్ట్ మెంట్ అయితే ఆ నివాసులు అంతా సమ్మేళనం కు వచ్చి కవిత్వం వినుడు .కవిత్వ సభల్లగా వేదిక లు ఉండయి .సుట్టు కూసునుడు రాత్రి తొమ్మిది దాటిందాకా కవిత్వం మాట్లడుకునుడు .ప్రతి సారి కొత్త వాళ్ళ తోని ప్రారంభిచుడు.ఆ తరువాత బస్సులెక్కి దూరం పోయేవాళ్ళు .అటేనుక లోకల్లున్న పాత కవులు ..ఇలా కరీంనగర్ కవిత్వం కొత్త పోకడలు పోతంది .దీన్ని ప్రేరణ గా ముంబై ,జనగాం ,సిద్ధిపేట లలో మొదలైతంది ...దీని పేరు ‘ఎన్నీల ముచ్చట్లు ‘ ఇది పత్రికల్లో బాగా ప్రచారం సుత అయ్యింది .నమస్తే తెలంగాణా బతుకమ్మ లో కవర్ పేజి ఆర్టికల్ .ఇండియన్ ఎక్స్ ప్రెస్ ల స్టేట్ పేజీల వచ్చింది v6 లో ప్రసారం అయ్యింది .దిన పత్రికల జిల్లా పెజీలనైతే పున్నం పున్నం కు వస్తంది .ఈ ప్రచారం తోని ఇదివరకు తెలువని కవులు ఎందరో కలుస్తుండ్రు .కవిత్వం సడువుతుండ్రు వచ్చే పున్నం కు పుస్తకం అచ్చు ల కవిత సూసుకున్టుడ్రు......... కవిత్వం కావాలె...కవిత్వం కావాలె ......ఎన్నెల ముచ్చట్ల కవిత్వం ల తడిసి పోవాలె ... జయ హో కవిత్వం

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pIbDYb

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి