కత్తిమండ ప్రతాప్ |||చిటారు కొమ్మల్లో మిటాయిపొట్లం||| =================================== అసమానతల నడుమ నిత్యం నయవంచనకు లోనవుతూ పంటి గాటుల మధ్య బాధను అదిమిపట్టి నవ్వుతూ... కృత్రిమం గా బతికేస్తున్నా అవశేషాలు శాపాలై వెంటాడే నీడల్లా తరుముకొస్తుంటే- నీడలోనే ఎన్నో చిత్ర విచిత్రాలు కాలంలో మెరుగులు అద్దుకుంటున్నాయి సూర్యోదయం కూడా ఎర్రగానే ఉంది అస్తమయం కూడా నిప్పులు చెరిగేస్తుంది హఠాత్తుగా జారిపోయే భానుడు కదా నా ఆలోచనల్లా !భావోద్వేగం ఎక్కువే ! తెల్లారని జీవితాల మధ్య ఎన్నో ఎన్నెన్నో నూతన సంవత్సరాలు కరిగిపోతున్నాయి జీవన పోరాటం ఎక్కడి వేసిన గొంగలి అక్కడేలా కొట్టు మిట్టాడుతుంది జ్ఞాపకాలు వారసత్వ పునరావృతాలై పాత చిగురునే తెచ్చుకుంటున్నాయి చెడు జ్ఞాపకాల మధ్య వేప కాడలై అను నిత్యం వెక్కిరిస్తున్నాయి రుచులెరుగని జీవితం షడ్రుచుల కష్టాలు మాత్రం చూపెడుతుంది తరాలు మారిన మారని నవ వసంతం చిటారు కొమ్మల్లో మిటాయిపొట్లం లా కనపడుతుంది నేనింకా చెట్టు కిందే ఉండిపోయా పైకి అమాయకం గా చూస్తూ ఆకాశంలో దాగిన ఆశలన్ని తుర్రు పిట్టల్లా ఎగిరిపోతున్నాయి గోటి పై చుక్క కోసం నేను నిస్తేజం గా చూస్తుండిపోయాను ================== మార్చి ఆఖరు /2014
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pw2HoN
Posted by Katta
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pw2HoN
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి