పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఏప్రిల్ 2014, బుధవారం

Swarnalata Naidu కవిత

శ్రీస్వర్ణ || ఉగాది || అవనిని పలకరించే అరుణారుణిమ గీతికలు పచ్చికబయళ్ళపై మంచు తుంపరల తుషారాలు మత్తిల్లిన కోయిల హిందోళగానాలకి ...దంతక్షతాలకి... మావిచివుళ్ళు సిందూర వర్ణాలనే పులుముకున్నాయి ! తుమ్మెదల ఝంకార నాదాలకి సిగ్గుతో తలవాల్చిన కుసుమపరాగాలు వాసంత సమీరాలకి తేనెసోనలు కార్చే సుమబాలలు మలయమారుతాలు వనకన్య చెక్కిళ్ళపై వ్రాసే మకరికాపత్రాలు తటాకంలో మెరిసే బంగారు వర్ణపు నీరు..సూర్యకిరణాల ప్రతిబింబాలే ! లతల లావణ్యంతొ వనమంతా వింతసౌరభాలు, కమ్మతెమ్మెరల రసభావనలకి .. మయూరాల వింజామరలు కోనేటిలో రాయంచల వలపు విహారాలు..జలపుష్పాల నాట్య విలాసాలు కొమ్మ కొమ్మనూ పలకరించే వసంతుని శ్వాసతో ఆమనికే వింత సొబగులు సెలయేటిలో దాగిన తుంబురుని వీణానాదాలు ! శుకపికాల సంగీతవిభావరి..వేపపూతల సుగంధాలతో..మామిడిపూతలతో మధురఫలాలతో ..మకరందాల జల్లులు కురిపిస్తూ..వనకన్య ధవలవర్ణ కాంతుల్లో హిమవత్పర్వతాలు ..రసమయ జగత్తులో ఒంపుసొంపుల మందాకినీ సోయగాలు ! వయ్యారుల సిగలో మల్లెజాజుల విరహతాపాలు నవనవలాడే నవమల్లికలు కొత్తజంటకు శృంగార ఉద్దీపనలే మదుప సేవనంలో అలిసిన తుమ్మెదలు రెమ్మరెమ్మకు ఆరాటమే మన్మధబాణాల స్పర్శతో పులకించి పోవాలని ! వీధివీధిన పంచాంగ శ్రవణాలు పుట్టింటికి కళ తెచ్చే కొత్త అల్లుళ్ళ ఆగమనం షడ్రుచుల సమ్మేళనం..ఉగాది పచ్చడితో శ్రీకారం..నవ్యజీవనానికి జయనామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ.. పచ్చదనాల హారతినిస్తూ ...వసంతకన్య

by Swarnalata Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dIIs5t

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి