నిశీధి | ఫైట్ ఫర్ లైఫ్ | వైవిధ్యపు వైర్ చివర జీవితానికో జడ్జ్ మెంట్ డే దొరుకుతుందో లేదో అంటూ పూల కోసం యే మార్గం లో వెతుకుతున్నావు చీకట్లో పరిపూర్ణత కోసం ఎన్ని సార్లు పాత మొహాన్నే పగలకోట్టుకుంటూ అసందర్భంగా యే వాదాన్ని యాచిస్తున్నావు రెస్క్యూ కోసం జారిపోతున్న ఇసుకల్లాంటి నవ్వులు ఒడిసిపట్టుకోవటానికి నిజాల నీడ నుండి పారిపోతూ సూర్యుడి కాన్వాస్ ని ఉమ్ముల రంగులతో ఎన్ని సార్లు నింపుతావు యుద్ధాలన్నీ శాంతికోసమేనట ఇంకా మొదలవని యుద్ధాల వెనక అశాంతి నీడల కదలిక తెలుస్తుందా నీకు జనోద్దరణ పేరుతో భారీహస్తాల పెట్రోలు యుద్ధాలు తెలుస్తున్నాయా ? మెలుకువగా ఉండు , మగతలని కనుచూపు మేరలో కనబడనివ్వకు రెప్ప వాల్చే సెకనులోనే నీ అస్తిత్వం మరుగు చేసే రక్కసులున్నాయి నిన్ను శాశ్వత నిద్ర కి పంపి నీ ఎముకల పొడి తో వ్యాపారం చేసే నయా వలస వాదం మరో సారి మతం ముకౌటా తగిలించుకొని నీ రక్తం తాగడానికి సిద్దమయింది అందుకే అసాధారణ ఆలోచన శబ్దాలు కొన్ని గుప్పిట్లో దాచుకోని ప్రవహిస్తున్న నీలపు ఆకాశ ప్రవాహం లో మునిగితేలుతూ ఇంద్రధనస్సు కిరణాల లో సమ తత్వపు సమాధానాలు వెతుకు గత సమస్యల శంకువు తోకచుక్క లా పగిలినప్పుడు రక్తపర్వతాలు బ్రద్ధలయిన లావాలో నువ్వు మునగకముందే స్టాగ్నేటేడ్ వాటర్లా వాసన రాకుండా మనసుని కొంచం చలించనివ్వు నీరసించిన హృదయాలతో నీతో పాటు రాత్రి నీడల్లో చలి ముచ్చట్లు వినే కొన్ని గుండెలని తట్టి లేపు భయాలన్నీ సమూలంగా బహిష్కరించి బ్రతుకు కోసం పోరాడు . నిశీ!! 02/04/14
by బ్రెయిన్ డెడ్
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAtBcD
Posted by Katta
by బ్రెయిన్ డెడ్
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAtBcD
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి