కల్చరల్ డాగ్ *********** జాగ్రత్త గురూ రెచ్చిపోయి నీ దేశం దరిద్రాన్ని అక్షరీకరిస్తావేమో.... పెట్రేగి నీ దేశం మత హింసను రంగుల్లో దృశ్యమానం చేస్తావేమో ఆందోళనతో నీ దేశంలో అన్యాయాలను....అక్రమాలను ఖండిస్తూ నిప్పుల సంగీతమై మండిపోతావేమో జాగ్రత్తరా బాబూ ! దేశభక్తులకు ఆగ్రహం వస్తుంది నిన్ను దేశద్రోహిగా చిత్రీకరించి చించిపారేస్తారు ******* ****** ఆకలి ఇండెక్స్ లో మన దేశం అగ్రస్తానంలో ఉందని కరిగి కరిగి కన్నీరయ్యేవు సుమా ! సంస్కృతీ పరిరక్షకులకు నరాలు తెగుతాయి నువ్వు సొంత దేశం దరిద్రాన్ని అమ్ముకునే పరాయి దేశం కిరాయి రాతగాడిగా కీర్తికెక్కుతావు ఆకలి చావులనైనా....ఆత్మహత్యలనైనా అదృష్టవంతులకు స్వర్గప్రాప్తి దొరికిందని భావప్రాప్తి పొందాలి. ప్రసాద మూర్తిగారు రాసిన ఈ కవితలో లోని కొంత భాగమే ఇది. కల్చరల్ డాగ్ ల కోపానికి ఆహుతైనట్లుంది రచయిత.సొంత అనుభవం లేకుండా రచయిత కవితను ఇంత బలంగా రాయలేడనిపిస్తుంది. ఎందుకంటే ఇంత కౄరమైన అనుభవాన్ని ఎవరితోనైనా పంచుకుంటే , వినే వారు సామాన్యంగా కల్చరల్ డాగ్ రియాక్షన్ ఇంత దారుణంగా ఉంటుందంటే నమ్మరు. మొత్తంపైన కవి వాస్తవాన్ని సెటైర్ గాను,కవితాత్మకంగా చెప్పడం లో కృత కృత్యుడయ్యాడు.ఈ వస్తువు పై ఖాదర్ మొహియుద్దీన్ రాసిన ' పుట్టు మచ్చ ' మరియు రచయిత పేరు జ్ఙాపకం లేదుగాని ఇంకో కవిత ' లాల్ బనో గులామీ చోడో ఔర్ బోలో వందేమాతరం ' తర్వాత వచ్చిన బలమైన మూడో కవిత ఇది.
by Subhash Koti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fhQLpy
Posted by Katta
by Subhash Koti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fhQLpy
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి