పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఏప్రిల్ 2014, శనివారం

Chand Usman కవిత

చాంద్ || పుస్తకం || నువ్వు ఈ పుస్తకాన్ని తప్పక చదివుండాల్సింది నీకు మరలా తారసపడదేమో జాగ్రత్తపడు హృదయాన్ని తెరిచి ఆ వెలుగులో చదవడం మొదలుపెట్టు పసి పాప వ్రేళ్ళు నిన్ను తాకుతున్న అనుభూతి నిన్ను తెల్లని కాగితంగా మార్చడం గమనిస్తావు ******* అది నాలుగు పేజీల పుస్తకం కాదు నీకు పాలిచ్చే స్తనాలు నడుస్తున్న గోడలు బద్దలుగొట్టి వెళ్ళు రక్తమంటిన పూల వంటి అక్షరాలు దాగివున్నాయి బహుశా ఇదేనేమో నువ్వు వెతకాల్సిన పుస్తకం ******* ఇప్పుడు నువ్వు ప్రసవ వేదన పడుతున్న తల్లివి చివరి పేజీ పూర్తయ్యేసరికి తప్పక మరలా పుడతావ్ ఇప్పటికైనా అర్ధమైంది కదూ నువ్వూ లోకం పూర్తవ్వని పుస్తకాలని * * * ఇక్కడ చిగురించడం గమనించావా అదే.. నీ పుస్తకాన్ని ఎవరికోసమో పాతి పెట్టబడిన చోట మీ చాంద్ || 26.04.2014 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lStNUM

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి