గుబ్బల శ్రీనివాస్ ________రాతిపుష్పం ఉలి గాయాల్ని పైపూత పూసుకుని శిలల రేకల రెక్కలు విచ్చి పరిమళం వెదజల్లని ఓ రాతిపుష్పం నువ్వు . అచేతనమైన నువ్వు ప్రతిరోజూ పుష్పించాలని అనుకుంటావు మరిక్కడ వసంతాల్ని మొలకెత్తించేదెవరు ? బండశిలల జంట వీడి.. ఈ గుండెను కోస్తున్నావు ఉన్న కాస్త పన్నీటి చలమల్ని పీల్చేస్తూ . నీకు ఎలానూ అశ్రువుల్ని వర్షించటం తెలీదు ఈ కళ్ళనెందుకు రెప్పలతో బందిస్తావు . ఆ క్షణం నా హృదయం స్థాణువులా నీ ఉనికిని కనుగొన్న ప్రతిసారీ నా కన్నులు నావి కావేమోనని . మకరంద బిందువులతో మెరుస్తావు తీరా తాకబోయే హృదయానికి గండశిలల స్పర్శను రుచి చూపిస్తూ . ఇహ నీతో మాట తీసుకోవాలి ఈ జన్మకు ఇటుగా రాబోకని, నా గుండె స్పందనలను ద్వంసం చెయ్యొద్దని ! (26-04-2014)
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fhTy21
Posted by Katta
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fhTy21
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి